ఏపీని కరోనా కమ్మేస్తుంది. మొన్నటివరకూ బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ఎప్పుడైతే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావటానికి ప్రయాణాల్ని అనుమతించారో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజులో ఏపీలో రికార్డుస్థాయిలో ఆరేడు కేసులకు తక్కువగా ఐదు వేల పాజిటివ్ కేసులు నమోదుకావటం చూస్తే.. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం కాక మానదు.
ఏపీలో పెద్ద ఎత్తున నమోదవుతున్న కేసులకు తగ్గట్లే.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీ అన్నంతనే చాలామందికి గుర్తుకు వచ్చే పట్టణాల్లో టెంపుల్ టౌన్ తిరుపతి ఒకటి. తాజాగా మంగళవారం ఒక్కరోజులో తిరుపతి పట్టణంలో 493 కేసులు నమోదుకావటం చూస్తే.. ఆ పట్టణాన్ని కరోనా ఎంతలా కమ్మేసిందో ఇట్టే అర్థమవుతుంది.
తిరుపతి పట్టణమేమీ హైదరాబాద్ అంత పెద్దది కాదు. మంగళవారం ఒక్కరోజులో హైదరాబాద్ లో కేసులు 703 మాత్రమే నమోదయ్యాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో కేసుల సంఖ్య తగ్గింది. ఇక్కడ నమోదైన కేసులతో పోలిస్తే.. తిరుపతి పట్టణంలో ఎంత భారీగా కేసులు నమోదు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతకంతకూ కేసులు పెరిగిపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతితో పాటు.. రూరల్ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి శెట్టిపల్లిలో ఒక్కరోజులో 88 కేసులు నమోదు కాగా.. తిరుచానూరులో 87.. అవిలాలలో 55.. పద్మావతిపురంలో 40 చొప్పున కేసులు నమోదయ్యాయి.
తిరుపతి రూరల్ పరిధిలోని అన్ని పంచాయితీల్లోనూ కరోనా వైరస్ వ్యాపించింది. ఊహించని రీతిలో విరుచుకుపడుతున్న కరోనా తాకిడికి గ్రామ పంచాయితీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు. పలు సలహాలు.. సూచనలు జారీ చేస్తున్నారు.