మహమ్మారి పుట్టిల్లు వూహానే.. కీలక ఆధారాలు ఎలా దొరికాయి?

Update: 2021-02-09 08:15 GMT
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారికి పుట్టిల్లు వూహాన్ మహానగరమే అయినప్పటికి.. దీనికి మూలం ఎక్కడ? అన్నది ప్రశ్న. మొదట్నించి వినిపిస్తున్న మాంసం మార్కెటా? లేదంటే వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ ప్రమాదకర వైరస్ లీకైందా? అన్న ప్రశ్నకు సమాధానాలు లభించని పరిస్థితి. దీంతో.. అసలేం జరిగిందన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుతున్న దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్ వోకు చెందిన పద్నాలుగు మంది నిపుణుల టీం ఆధారాల్ని సేకరిస్తోంది.

ఈ టీంకు లభించిన ఆధారాలతో ఒకట్రెండు రోజుల్లో నివేదిక బయటకు రానున్నట్లు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ వో నుంచి వచ్చిన పద్నాలుగు మంది సభ్యులు మూడు టీంలుగా విడిపోయి దర్యాప్తును నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తిలో జంతువుల పాత్ర ఏంత? అన్నది కీలక ప్రశ్నగా మారింది. కరోనా ప్రబలిన తర్వాత.. వూహాన్ మార్కెట్ మొత్తాన్ని అధికారులు పెద్ద ఎత్తున శుభ్రం చేశారు. అయినప్పటికి.. వ్యాపారులు వాడి పక్కన పెట్టేసిన పరికరాలతో పాటు.. అక్కడి గాలి.. మట్టి.. నీరు.. చెత్త.. మురికినీటి శాంపిళ్లను సేకరించారు.

కీలక అంశాల్ని తాము గుర్తించినట్లుగా ఈ టీం చెబుతోంది. అయితే.. తామేం సేకరించాం.. తమకు లభించిన ఆధారాల గురించి మాత్రం మాట్లాటం లేదు. మాంసం మార్కెట్లో తమకు కీలక ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు. అవేమిటన్న విషయంపై అంతర్జాతీయ టీం పెదవి విప్పితే తప్పించి బయటకు రాని పరిస్థితి.
Tags:    

Similar News