ఆంధ్రప్రదేశ్ లో వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త చోట్ల ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గుంటూరు మిర్చి యార్డులో వైరస్ కలకలం సృష్టిస్తోంది. మూడు కేసులు ఇక్కడ నమోదవడంతో రైతులతో పాటు వ్యాపారులు, కూలీలు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మిర్చి యార్డు గుంటూరులో ఉంది. ఈ యార్డు నుంచే దక్షిణ భారత దేశమంతటా మిర్చి సరఫరా అవుతుంటుంది. తాజాగా ఈ మిర్చి యార్డులో వ్యాపారం నిర్వహించే ముగ్గురికి వైరస్ పాజిటివ్ సోకడంతో యార్డును మూసివేశారు. ఈ మిర్చి యార్డుకు నిత్యం వందల సంఖ్యలో రైతులు తమ మిర్చి పంటను తెచ్చి అమ్ముతుంటారన్న సంగతి తెలిసిందే.
యార్డులో వ్యాపారులకు వైరస్ సోకడం తో, వ్యాపారం నిర్వహించే ప్రాంతాన్ని బారికేడ్ల తో మూసి వేశారు. శని, ఆదివారాలు మార్కెట్ కు సెలవు. ఈ రెండు రోజుల్లో మార్కెట్ శుభ్రం చేయనున్నారు. తిరిగి సోమవారం నాడు పరిస్థితిని సమీక్షించి యార్డును తెరిపిస్తామని అధికారులు చెబుతున్నారు. యార్డు మొత్తాన్నీ సోడియం హైపోక్లోరైడ్ తో శానిటైజ్ చేస్తున్నట్లు యార్డు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వ్యాపారుల వద్దకు వచ్చిన రైతులు, దళారీలు, కూలీలను గుర్తించి, వారిని తగు జాగ్రత్తల తో ఉండాలని సూచించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి ప్రాథమిక కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.