ప్రపంచాన్ని చుట్టేసిన మహమ్మారికి కారణం చైనాలోని వూహాన్ అన్న మాట ఎవరిని అడిగినా చెబుతారు. అక్కడి మాంసం దుకాణాల్లో పుట్టిన వైరస్ తో ఇప్పుడింత రచ్చ జరిగిందన్న వాదన వినిపిస్తుంటే.. ఇదేమీ లేదు.. చైనా ల్యాబ్ లో తయారు చేసిన ఈ వైరస్ పొరపాటున బయటకు వచ్చి.. ఇంత దారుణానికి కారణమైందన్న మాట పలువురి నోట వినిపించటం తెలిసిందే. అయితే.. ఈ రెండు వాదనలు తప్పని.. అసలు ఈ మాయదారి రోగానికి కారణంగా ఇప్పటివరకూ అందరు అనుకుంటున్నవేమీ కావంటున్నారు చెన్నైకి చెందిన సైంటిస్టు ఒకరు.
డిసెంబరులో చోటు చేసుకున్న సూర్య గ్రహణమే.. తాజా మాయదారి రోగానికి కారణమంటున్నారు. తాను ఉత్తగా చెప్పటం లేదని.. సైన్సు పరంగానే తన వాదన ఉందని చెబుతున్నారు. చెన్నైలోని న్యూక్లియర్ అండ్ ఎర్త్ సెంటిస్టుగా వ్యవహరిస్తున్న సుందర్ కృష్ణ వాదన భిన్నంగా ఉంది. 2019 డిసెంబరు 26న సూర్య గ్రహణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ సంద్భంగా సూర్యుడి నుంచి వచ్చిన ఫిషన్ ఎనర్జీ లో న్యూట్రాన్స్ పరివర్తనం చెందటం వల్లేఈ వైరస్ పుట్టిందని చెబుతున్నారు. గ్రహాల మధ్య జరిగే ఒత్తిడిలో వచ్చిన మార్పుల కారణంగా భూమి పైభాగంలో కొత్త వైరస్ పుట్టటానికి కారణమంటున్నారు. సూర్యుడి నుంచి న్యూట్రాన్సు ను తీసుకోవటం ద్వారా భూమిపై బయో న్యూక్లియర్ అనుసంధానం జరిగి ఉపరితలంపై కొత్త జీవి పుట్టటానికి కారణమైందన్నది ఆయన వాదన. జూన్ 21న మరోసారి సూర్యగ్రహణం రాబోతుందని.. దాంతో ఈ మహమ్మారికి చెక్ పెట్టే అవకాశం ఉందంటున్నారు.
అదెలా అన్న దానికి ఆయనో వాదన వినిపిస్తున్నారు. తాజాగా ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా సూర్య కిరణాల్లో తీవ్రత తగ్గుతుందని.. దీంతో వైరస్ నీరసిస్తుందన్న వాదనను వినిపిస్తున్నారు. తాను చెప్పేదంతా గ్రహాల మధ్య తరచూ చోటు చేసుకునేదని ఆయన చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న వాదనకు భిన్నంగా చెబుతున్న సుందర్ కృష్ణ మాటలు ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మరి.. ఆయన చెప్పే వాదనలో నిజం ఎంతన్నది తేలాలంటే.. జూన్ చివరి వారం వరకూ వెయిట్ చేస్తే సరి.