కరోనా దెబ్బకు ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. భారత్ కూడా బాగా దెబ్బతింది. దీంతో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారింది. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
రాష్ట్రాలకు మొత్తం 1.51 లక్షల కోట్లు జీఎస్టీ బకాయిల కింద చెల్లించాల్సి ఉందని తెలిపారు. జీఎస్టీ బకాయిల కింద అత్యధికంగా మహారాష్ట్రకు రూ.22485 కోట్లు చెల్లించాల్సి ఉందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆ తర్వాత కర్ణాటకకు రూ.13763 కోట్లు, తెలంగాణకు 5424 కోట్లు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు.
పెండింగ్ లో ఉన్న పరిహారం, భవిష్యత్ చర్యల గురించి ఆగస్టు 27న జీఎస్టీ మండలి 41వ సమావేశంలో చర్చించామని మంత్రి తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన లోటు రూ.97వేల కోట్లు కాగా.. కరోనా వల్ల రూ.1.38 లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్ లో 2020-21 సంవత్సరానికి గాను జీఎస్టీ వసూళ్లు 690500 కోట్లు వస్తాయని అంచనావేశారు. అయితే ఆగస్టు 181050 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఇది కేవలం 26.2శాతం వెల్లడించారు. కరోనా వల్లే ఇలా జరిగిందని వివరించారు.