లేటెస్ట్ అప్డేట్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ

Update: 2020-09-17 04:30 GMT
భారత్‌ లో కరోనా మహమ్మారి‌ విజృంభణ కొసాగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో  కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 1,132మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 51,18,254కు చేరుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 83,198కి పెరిగింది. వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటి వరకు 40,25,079 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో 10,09,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా నమోదైంది.  కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,05,65,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్క రోజులోనే 11,36,613 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 11,21,221 మందికి కరోనా సోకగా.. 30,883 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటి వరకు 5,92,760 కేసులు నమోదవగా.. 5,105 మంది చని పోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.
Tags:    

Similar News