కరోనా ఖతం చేసే అణువొచ్చింది!

Update: 2020-09-17 04:45 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలా కుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థికంగా పతనమయ్యాయి. మందులేని ఈ మాయదారి రోగం జనాలను సర్వనాశనం చేసింది. ఓ వైపు కరోనా వచ్చిన నిరు పేదలు ఆస్పత్రి బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కరోనా దెబ్బ కు ఉపాధి కోల్పోయి ఇంకొందరు పేదలు ఆకలి తో అలమటిస్తున్నారు. మొత్తం మీద ఈ రోగం ప్రపంచాన్ని వణికించింది. అయితే కరోనా మహమ్మారి అంతమొందించే వ్యాక్సిన్​ను కనిపెట్టేందుకు  ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలు తీసుకొచ్చిన వ్యాక్సిన్లు మొదటి, రెండో ట్రయల్​ను పూర్తిచేసుకొని.. మూడోదశ ట్రయల్స్​ నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా శాస్త్ర వేత్తలు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు ఓ అణువును కనిపెట్టారు.

ఈ అణువు కరోనా వైరస్​ను అంతమొందిస్తుందని వారు చెబుతున్నారు. ఈ అణువు సాయంతో కరోనాకు తేలికగా మందు కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది చివరినాటికి.. లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించనున్నారు. ఈ అణువును కనిపెట్టింది అమెరికాకు చెందిన ప్రఖ్యాత పిట్స్​బర్గ్​ యూనివర్సిటీ పరిశోధకులు.  ఈ అణువు.. కరోనా వైరస్​ ను న్యూట్రిలైజ్​.. తెలుగు లో చెప్పాలంటే తటస్థం చేస్తుందని సదరు పరిశోధకులు తేల్చారు. అంతేకాక ఈ అణువు శరీరం లోని వెళ్లిన వెంటనే భారీ స్థాయిలో యాంటీబాడీస్​ ను ఉత్పత్తి చేసి కరోనా మహమ్మారిని అంతమొందిస్తుందని చెప్పారు.

కాగా ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్​ కావడం తో మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ అణువుపై మరింత విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరుగవలసి ఉందని  శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అణువు తో కరోనా ను అంతమొందించే డ్రగ్​ ను చాలా తేలికగా రూపొందించవచ్చని చెప్పారు. కాగా ఈ అణువుపై ట్రయల్స్​ నిర్వహించేందుకు అనుమతి కోసం శాస్త్రవేత్తలు ఎఫ్​డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా అనుమతి రాలేదు. అనుమతి వచ్చిన వెంటనే ట్రయల్స్​ సాగునున్నాయి. ఈ మందు ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నాసల్​  స్ప్రే రూపంలో దీన్ని అందుబాటులో తీసుకొస్తామని సైంటిస్టులు చెబుతున్నారు.
Tags:    

Similar News