లేటెస్ట్ అప్డేట్ : భారత్‌ లో 53 లక్షలు దాటిన కేసులు

Update: 2020-09-19 07:15 GMT
భారత్‌ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రికవరీలతో పాటు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 93,337 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే , మరో 1,247 మంది మరణించారు. నిన్న 95,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,014కి చేరింది. కరోనాను జయించి 42,08,431 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌ తో పోరాడుతూ 85,619 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 10,13,964 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇక , కరోనా నిర్దారణ పరీక్షల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 8,81,911 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌ లో ఇప్పటి వరకు 6 కోట్ల 24 లక్షల 54,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఇక , దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 11,67,496 మందికి కరోనా సోకగా.. 31,791 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6,09,558 కేసులు నమోదవగా.. 5,244 మంది చనిపోయారు.
Tags:    

Similar News