కరోనా అప్డేట్ : దేశంలో ఒక్కరోజే 86,961 కేసులు - 1130 మరణాలు!

Update: 2020-09-21 07:30 GMT
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే దేశంలో 54 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  ప్రతిరోజూ రికార్ట్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 86,961 మంది కి కరోనా వైరస్ నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,87,581కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,130 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 87,882కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 43,96,399 మంది కోలుకున్నారు. 10,03,299 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది. ఇకపోతే, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,43,92,594 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 7,31,534 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.

ఇక తెలంగాణ విషయానికొస్తే .... ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,302 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,230 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,41,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,042కు చేరింది. ప్రస్తుతం 29,636 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.  

ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే...కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. 24 గంటల్లో ఏపీలో 7738 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,25,514కి చేరింది. అలాగే, 24 గంటల్లో ఏపీలో 57 మంది కరోనా వైరస్ బారిన పడి మృతిచెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 78836 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,41,319 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక రోజులో 10,608 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో 70455 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, మొత్తం 51,04,131 కరోనా శాంపిల్స్ టెస్టు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Tags:    

Similar News