భారత్ కరోనా అప్డేట్ : ఒక్కరోజే 75083 కేసులు, 1053 మరణాలు !

Update: 2020-09-22 07:50 GMT
ఇండియాలో గత కొన్ని రోజుల క్రితం వరకు దాదాపుగా లక్ష వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులు , గత మూడు రోజుల నుండి తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా  గత 24 గంటల్లో కొత్తగా 75083 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజూ లక్ష కేసుల దాకా నమోదయ్యే పరిస్థితి నుంచి 75వేలకు తగ్గాయంటే... ఇండియాలో కరోనా వ్యాప్తి  తగ్గుతుంది అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.   నిజానికి టెస్టుల సంఖ్య తగ్గుతుండటంతో, కొత్త కేసుల సంఖ్య కూడా తక్కువగా వస్తోంది. అంతే తప్ప కరోనా వ్యాప్తి తగ్గలేదని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,62,663కి చేరింది.

ఇక , గత 24 గంటల్లో ఇండియాలో  1053 మంది చనిపోవడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 88935కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 3.08 శాతంగా ఉంది. ఇండియాలో 24 గంటల్లో 101468 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 9,75,861గా ఉన్నాయి. దేశంలో నిన్న 9,33,185 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 6కోట్ల 53లక్షల 25వేల 779కి చేరింది.

ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, అమెరికా ఉన్నాయి. 
Tags:    

Similar News