కరోనా అప్డేట్ : దేశంలో 24 గంటల్లో 45,148 కేసులు

Update: 2020-10-26 05:15 GMT
కరోనా వైరస్ .. కరోనా వైరస్ ఈ మహమ్మారి మనుషుల జీవితాలతో ఆదుకోవడం మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా కూడా , ఈ మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ అంటూ మళ్లీ విజృంభిస్తుంది. కరోనా దెబ్బకి ఎన్నో దేశాలు గజగజ వణికిపోతున్నారు. ఇండియాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నప్పటికీ  మొత్తంగా చూసుకుంటే పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కొత్త కేసులు మళ్లీ 50వేలకు దిగువన రావడం మంచి పరిణామం. మొత్తం కేసుల సంఖ్య 79,09,959కి చేరింది. అలాగే  కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో  480 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,19,014కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.7 శాతంగా ఉంది

 దేశంలో నిన్న 59,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 71.37,228కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 90.23 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,717 ఉన్నాయి. మొన్నటికీ, నిన్నటికీ యాక్టివ్ కేసులు 14,437 తగ్గాయి. ఇండియాలో నిన్న 9,39,309 టెస్టులు చేశారు. మొన్నటి కంటే నిన్న 2,01,596 టెస్టులు తక్కువగా చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 10,34,62,778కి చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఫ్రాన్స్ రెండోస్థానాన్ని చేరింది. భారత్ మూడోస్థానానికి పడిపోయింది. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంటే... ఆ తర్వాత ఫ్రాన్స్ వచ్చింది. ఇండియా మూడో స్థానానికి చేరింది. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్ , ఇండియా, మెక్సికో , బ్రిటన్ , ఇటలీ  తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 582 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,834 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,311 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,432 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,11,912 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 14,729 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,94,417 కు చేరింది.
Tags:    

Similar News