ప్రపంచ దేశాలతో పోల్చితే... కరోనా ను భారత్ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయితే, యూరప్ దేశాల ప్రజలు కరోనా పోయిందిలే అని లైట్ తీసుకున్నారు. అయితే , ఇప్పుడు అక్కడ అది మళ్లీ మొదలై మరింత జోరుగా ఉంది. అందువల్ల ఇండియాలో కూడా కరోనాను తేలిగ్గా తీసుకోకూడదనే విషయం స్పష్టమవుతోంది. తాజాగా నిన్న కొత్తగా 45,231 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 82,29,313కి చేరింది. అలాగే, నిన్న 496 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,607కి చేరింది.
ఇండియాలో నిన్న 53,285 మంది కరోనా నుంచి కోలుకోవడంతో... మొత్తం రికవరీల సంఖ్య 75,44,798కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 91.7 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 5,61,908 ఉన్నాయి. నిన్న ఇండియాలో 10,91,239 టెస్టులు చెయ్యడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 11,07,43,103కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.57 శాతంగా ఉంది. ఇండియాలో వరుసగా 8వ రోజు 50వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అలాగే... వెయ్యి కంటే తక్కువగా కరోనా మరణాలు వరుసగా 15వ రోజు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 30 రోజులుగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్... టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక ... తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 922 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరింది. 24 గంటల్లో ఏడుగురు కరోనా బారిన పడి మరణించగా , మృతుల సంఖ్య 1,348కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,456 మంది డిశ్చార్జ్ కాగా, కోలుకున్న వారి సంఖ్య 2,21,992 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25,643 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 43,49,309 కు చేరింది.