భయం.. ఆందోళన.. అయినోళ్లకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న తాపత్రయం.. కరోనా మహమ్మారి విసిరే సవాల్ ను సాహసోపేతంగా ఎదుర్కోవటంతో పాటు.. దాని ధాటికి ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదన్న నిశ్చయం.. లాంటివెన్నో గతంలో భారతీయుల్లో కనిపించేది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే రీతిలో నిర్ణయాలు తీసుకునేవి. రెండోదశకు వచ్చేసరికి అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజలు కరోనా విషయంలో వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం.. అజాగ్రత్త కొంప ముంచేస్తోంది. కరోనా విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే.. అంత మంచిదన్న విషయాన్ని పట్టించుకోని తీరు.. ఈ రోజున దేశంలో అత్యంత దారుణమైన రికార్డులు నమోదయ్యేలా చేస్తుందని చెప్పాలి.
గత ఏడాది రోజువారీ కేసుల సంఖ్య 20 వేల నుంచి గరిష్ఠస్థాయి అయిన 97,894 కేసుల నమోదుకు చేరటానికి 76రోజులు అంటే.. రెండున్నర నెల పట్టింది. ఈ ఏడాది రోజువారీ కేసులు 20 వేల నుంచి 1.03లక్షలకు చేరుకోవటానికి కేవలం 25 రోజులు మాత్రమే పట్టిందంటే.. కేసుల నమోదు ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. గడిచిన మూడు రోజలుగా ప్రపంచంలో అత్యధిక కేసుల నమోదులో భారత్ అగ్రస్థానంలో నిలిచిన చెత్త రికార్డును సొంతమైంది. తాజాగా నమోదైన కేసుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.25కోట్లకు చేరుకుంది.
ప్రపంచంలో అత్యంత ఎక్కువగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా.. బ్రెజిల్ ఉంటే.. భారత్ ఆ రెండు దేశాల్ని అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానం మహారాష్ట్ర ఉండగా.. రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఛత్తీస్ గఢ్.. కర్ణాటక.. ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ.. తమిళనాడు... మధ్యప్రదేశ్.. పంజాబ్ రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. గణాంకాల్ని గమనిస్తే.. దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి.. జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత మందికి కరోనా పాజిటివ్ లు కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.