దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఏడాది పూర్తైన మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేదు. గత నెల నుంచి వైరస్ తీవ్ర రూపం దాల్చింది. ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయింది. దేశం ప్రస్తుతం రెండో దశ గుప్పిట్లో ఉందని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న కేసుల్లో కొత్త వేరియంట్లు ఎక్కువగా నమోదుకావడం గమనార్హం. వీటివల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు అంటున్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకే సామర్థ్యం ఈ వేరియంట్లకు అధికంగా ఉందని చెబుతున్నారు. అందుకే రెండో దశలో ఇంత వేగంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో వైరస్ మ్యూటెంట్లు గుర్తించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. బ్రెజిల్, యూకే వేరియంట్లతో సహా ఇతర వైరస్ ఉత్పన్నాలు సామర్థ్యాన్ని పెంచుకొని బలంగా మారుతున్నాయని అంటున్నారు. ఇవి ముందు వైరస్ లాగా కాకుండా శరీరంలోని ముఖ్య అవయవాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. లక్షణాల్లోనూ మార్పులు ఉన్నాయని స్పష్టం చేశారు.
కరోనా మ్యూటెంట్లతో మునుపటి లక్షణాల్లో మార్పు వచ్చిందని వైద్యాధికారులు తేల్చి చెప్పారు. కేవలం దగ్గు, జలుబు, జ్వరం కాకుండా పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు ఉంటున్నాయని గుర్తించారు. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. వైరస్లో జన్యుక్రమం మారడం వల్ల కొత్త వేరియంట్లు, డబుల్ మ్యూటెంట్లు ప్రాణాంతకంగా మారనున్నాయని చెబుతున్నారు.
మునుపటి వైరస్ వృద్ధులు, దీర్ఘకాలిక సంబంధ వ్యాధులు గల వారిపైనే ఎక్కువ ప్రబావం చూపేది కానీ వేరియంట్లు అందరిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. కాబట్టి జాగ్రత్తలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇస్తే వైరస్ను కొంతవరకు కట్టడి చేయలగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.