కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ దేశంలో నిరుద్యోగం మళ్లీ పెరుగుతోంది. నిరుద్యోగ శాతం ఏకంగా 8.6 శాతానికి చేరుకుంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 9.81 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతానికి పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లతో పాటుగా ఆంక్షలతో ఉద్యోగాల్లో కోతలు పడుతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. గతేడాది జాతీయ స్థాయిలో లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఎన్నో లక్షల మంది వలస కార్మికులు, రోజుకూలీలు పొట్టచేతబట్టుకుని వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లముందే కదులుతున్నాయి. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో చాలా వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మళ్లీ లభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలవడం ఆందోళనకరంగా మారింది.పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్లు, ఆంక్షలు, షరతులు, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. దీనితో మరోసారి వలస కూలీలు సొంత ఊర్ల బాట పట్టారు. క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం వ్యాపారాలపై ప్రభావం చూపుతోంది. దీంతో ఉద్యోగాల కోత మొదలైందని సీఎంఐఈ నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ 11తో ముగిసిన వారాంతంతో దేశంలో నిరుద్యోగం 8.6 శాతానికి చేరుకుందని తెలిపింది. రెండు మూడు వారాల కిందటి పరిస్థితి తో పోలిస్తే.. ఒక్కసారిగా నిరుద్యోగం పెరిగిందని వెల్లడించింది. అత్యధికంగా హర్యానాలో 28.1 శాతం, గోవాలో 22 శాతం ఉన్నట్లు తెలిపింది. కరోనా విజృంభణతో పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగాల్లో కోతలు మొదలైనట్లు పేర్కొంది.