ఇండియా లో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా పెరుగుతోంది. కరోనా రక్కసి విజృంభణతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారి సంక్రమణ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూలేని విధంగా 24 గంటల్లోనే ఏకంగా 2 లక్షలకుపైగా కేసులతో కొత్త రికార్డు నమోదయింది. యాక్టివ్ కేసులు కూడా 1,40,74,564కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 24 గంటల్లోనే 2,00,739 కేసులు కొత్తగా నిర్థారణ అయ్యాయి. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైందని కేంద్రం చెప్తుంది.
24 గంటల్లో మహారాష్ట్రలో 58,952 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 20,439, ఢిల్లీలో 17,282 కేసులు నమోదు అయ్యాయి. వరసగా తొమ్మిదో రోజు కూడా లక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కేవలం 9 రోజుల్లోనే 13,88,515 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,038 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. రోజువారీ మరణాల్లో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటి వరకు 26,20,03,415 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది ఇందులో భాగంగా భారత పురావస్తు శాఖ (ఏఎస్ ఐ ఆధీనంలో ఉండే చారిత్రక కట్టడాలతో పాటు మ్యూజియంలను మే 15 వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ మూసి వేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఎన్.కె.పాఠక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,840 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 1198 మంది కోలుకోగా.. మరో 9 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 3,41,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,09,594 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1198 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 20,215 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని.. ప్రజలంతా మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.