కరోనా కోటి సందేహాల్ని తీసుకొచ్చింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి ప్రపంచానికి విసిరిన సవాలుతో అందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. చూస్తుంటే.. సమీప భవిష్యత్తులో కరోనా భయం పూర్తిగా పోయి.. గడిచిపోయిన రోజులు రావా? అన్న సందేహం కలుగక మానదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగానే కాదు.. రానున్న మరిన్ని నెలలపాటు తీవ్రత ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంలో కొందరికి ఎదురయ్యే సమస్యలు అన్ని ఇన్ని కావు.
పిల్లలు ఉన్న వారి కష్టాలు ఒక రకంగా ఉంటే.. పిల్లలు లేని వారి పరిస్థితి మరోలా ఉంటుంది. పిల్లలు కావాలని అనుకున్నప్పటికి.. పిల్లలు పుట్టకపోవటానికి మించిన వేదన మామూలుగా ఉండదు. ఇందుకోసం వారు చేసే ప్రయత్నాలు వేరే వాళ్లకు విస్మయానికి గురి చేస్తాయి. కానీ.. వారి వేదన అర్థం కావాలంటే.. వారి కోణంలో ఆలోచిస్తే మాత్రమే అర్థమవుతుంది. సాధారణ పద్దతుల్లో పిల్లలు పుట్టని వారు.. వివిధ మార్గాల్లో పిల్లల్ని కనేందుకు ట్రై చేస్తుంటారు. ఇలాంటి విధానాల్లో ఫెర్టిలిటీ చికిత్స తీసుకునే విధానం ఒకటి తెలిసిందే.
ఈ విధానంలో భార్యభర్తలు ఇద్దరు వైద్యులు చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది. అలాంటి వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? లేదా? అన్న సందేహానికి సమాధానం అంత త్వరగా లభించదు. తాజాగా ఇదే అంశంపై స్పందించారు ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ ప్రీతిరెడ్డి. హైదరాబాద్ కు చెందిన ఈ వైద్యురాలు.. పిల్లల కోసం ప్రయత్నించే వారికి సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
పిల్లలు కోరుకునే వారి వయసు ఆధారంగా వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా? అన్నది తేల్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే.. వయసు ఎక్కువగా ఉన్న వారు మరింత ఆలస్యం చేస్తే.. వారి అండాల నాణ్యత తగ్గిపోతుందని.. తద్వారా సంతానం లేమి సమస్య ఏర్పడే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి వారు వ్యాక్సిన్ వేసుకునే కన్నా.. వైరస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. టీకా వేసుకునే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు.
విన్నంతనే మింగుడుపడటం కష్టంగా ఉన్నప్పటికి.. ఇది నిజమని చెబుతున్నారు. ఎందుకంటే.. రెండు వ్యాక్సిన్లు వేసుకున్న పదిహేను రోజుల వరకు పిల్లల కోసం ప్రయత్నించకూడదు. ఆ తర్వాతే.. వైద్యుల సూచనల మేరకు ట్రై చేయాల్సి ఉంటుంది. వయసు మీద పడిన వారు.. పిల్లలు తప్పనిసరిగా కావాలనుకునే వారికి.. ఈ మూడు నెలలు కూడా విలువైన కాలంగా చెప్పక తప్పదు. అందుకే.. వ్యాక్సిన్ కు వాయిదా వేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.