మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్, మరో వైపు లాక్ డౌన్ తో పాజిటివ్ కేసుల తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 1.5 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 20,75,428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,32,364 మందికి పాజిటివ్‌గా తేలింది. 24గంటల వ్యవధిలో 2,713 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి రోజు కంటే మరణాల సంఖ్య తక్కుగానే నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకూ 2,85,74,350 మందికి కరోనా సోకగా,3,40,702 మంది మరణించారు.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,65,97,655 మంది కోలుకున్నారు. 16,35,993 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు వేశారు. క్రియాశీలరేటు 6.02 శాతానికి తగ్గగా, రికవరీరేటు 92.79 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 2.65కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసుల్లో తగ్గుదల, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూలాంశాలు. మరోవైపు నిన్న 28,75,286 మంది టీకా వేయించుకున్నారు.కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 35,74,33,846 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న 20,75,428 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.