డెల్టా ఆరాచకం ముందు ఆల్పా తో భయపడాల్సిన అవసరమే లేదట

Update: 2021-06-13 00:30 GMT
కరోనా కుటుంబంలో కొవిడ్ 19 ఒకటి. ప్రపంచాన్ని వణికించిన ఈ కొవిడ్ 19.. తర్వాతి కాలంలో తన రూపును మార్చుకోవటం.. అలా మారిన వేరియంట్లు రెండు కలిసి మరో కొత్త మ్యూటెంట్ గా తయారై ప్రపంచానికి సిరీస్ ల చొప్పున సినిమా చూపిస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ 19 ఫస్ట్.. సెకండ్ సిరీస్ లు (చివరకు వచ్చేసింది) అయిపోయాయి. రానున్న రోజుల్లో థర్డ్ సిరీస్ (వేవ్) రానుందన్న అంచనాలు వెలువుతున్నాయి. మన దేశంలో థర్డ్ సిరీస్ విడుదల సెప్టెంబరు - అక్టోబరు మధ్యలో ఉండొచ్చని.. అదంటూ ఒకసారి వచ్చాక కనీసం రెండు నెలల పాటు ఆగమాగం చేస్తుందని చెబుతున్నారు.

అయితే..థర్డ్ వేవ్ లో డెల్టా వేరియంట్ మరింత బలపడి.. మరో కొత్త మ్యూటెంట్ అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. నిజానికి సెకండ్ వేవ్ తీవ్రత ఇంతలా ఉండటానికి కారణం డెల్టా వేరియంట్ గా చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో కనిపించిన ఇబ్బందికర ఆల్ఫా వేరియంట్ తో పోలిస్తే.. డెల్టా వేరియంట్ ఎంత ప్రమాదకరమైనదో సెకండ్ వేవ్ లో చూశాం.

తాజాగా ఈ రెండు వేరియంట్లపై పరిశోధన జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్టు తాజాగా విడుదలైంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఆల్పా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ ఏకంగా 60 శాతం ఎక్కువ తీవ్రతతో వ్యాప్తి చెందుతుందని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ ను ఒక ఊపు ఊపిన కొత్త కేసుల్లో డెల్టా వేరియంట్ కేసులే 90 శాతం వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు డెల్టా వేరియంట్ ఎంత డేంజర్ అన్నది ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News