తెలంగాణలో ప్రైవేటుగా టెస్టులు చేసే వారెవరంటే?

Update: 2020-05-21 05:15 GMT
రోగ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు జరుపుతాం. మిగిలిన వారికి అవసరం లేదని.. ప్రభుత్వ ఆసుపత్రులు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో.. మాయదారి రోగానికి తాము దూరంగా ఉన్నామని చెప్పాల్సి వస్తోంది. ఇలాంటి వారు.. మీకయ్యే ఖర్చును భరిస్తాం. ఎంతో చెప్పండంటే.. తిట్టి పోస్తున్నారు. మేం ఎలా కనిపిస్తున్నామన్నది ప్రభుత్వ ఆసుపత్రుల వాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో భరించే స్థోమత ఉన్న వారు ప్రైవేటుగా పరీక్షలు జరుపుకోవటానికి వీలుగా అనుమతులు ఇస్తే మంచిదేగా? అన్నది ప్రశ్న.

నిజమే.. మాయదారి రోగం ఉందా? లేదా? దానికి సంబంధించి వైద్య పరమైన రిపోర్టులు అవసరమైనోళ్లకు మేలు చేసేలా.. సందేహాల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే వారికి రిలీఫ్ ఇచ్చేలా ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యంత తక్కువ నిర్దారిత టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తేలింది. మాయదారి రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి.

ఇలాంటివేళ.. ఆ పరీక్షలు ఎక్కువగా జరపాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్ లకు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పన్నెండు ప్రైవేటు సెంటర్లకు అనుమతులు జారీ చేశారు. ఇలా ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్ ల వివరాలు ఇవే. ఇక్కడకు నేరుగా వెళ్లి.. తమకు నిర్దారణ పరీక్షలు చేయాలని కోరితే.. వారు చెప్పిన మొత్తాన్ని చెల్లిస్తే.. ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రైవేటు ల్యాబ్ లు ఏవంటే..
1. అపోలో హాస్పిటల్, జూబ్లీహిల్స్
2. విజయ డయాగ్నస్టిక్స్, హిమాయత్ నగర్
3. విమత ల్యాబ్స్, ఐడీఏ చర్లపల్లి
4. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్,బోయిన్‌పల్లి5. డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట
6. పాత్‌కేర్ ల్యాబ్స్, మేడ్చల్
7. అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్, శేరిలింగంపల్లి
8. మెడ్సిస్ పాథ్‌ల్యాబ్స్, న్యూ బోయిన్‌పల్లి
9. యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
10. బయోగ్నసిస్ టెక్నాలజీస్, మేడ్చల్ మల్కాజిగిరి
11. స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్
12. టెనెట్ డయాగ్నస్టిక్స్, బంజారాహిల్స్
Tags:    

Similar News