మహమ్మారి పేషెంట్లతో హైదరాబాద్‌ లో హాస్పిటల్స్ ఫుల్

Update: 2020-06-26 03:15 GMT
మహమ్మారి విస్తరిస్తోంది. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 489,877 కేసులు నమోదు కాగా, 285,076 కేసులు రికవరీ అయ్యాయి. ఈ రోజు 16,892 కొత్త కేసులు నమోదయ్యాయి. నేటి వరకు 15,303 మృతి చెందారు. తెలంగాణలో ఈ రోజు 920కి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 230కి చేరుకుంది. తాజా కేసుల్లో 737 గ్రేటర్ హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. హైదరాబాద్‌లో కేసులు పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్‌లో కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులు అన్నీ నిండిపోయాయి. మహమ్మారికు ట్రీట్మెంట్ ఉందని భావిస్తున్న ఆసుపత్రులు అన్నీ పుల్ అవుతున్నాయి. కొత్తగా రోగులు వస్తే కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ అయ్యే వరకు ఒకటి రెండు రోజులు వెయిటింగ్‌లో పెడుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆసుపత్రులు సర్వీస్‌ను, చికిత్సను డోల్ డెలివరీ చేస్తున్నాయట.

ఈ సేవలు డోర్ డెలివరీ అంటే మరింత ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సేవలకు రోజుకు రూ.25వేల వరకు కూడా వసూలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మెడిసిన్స్, ఆక్సిజన్ వంటి వాటికి అదనంగా చెల్లించాలట. ప్రస్తుతం హైదరాబాద్ వచ్చేందుకు చాలామంది భయపడుతున్నారు. ఎవరైనా వద్దామనుకున్నప్పటికీ తోటి వారు వెళ్ళవద్దని హెచ్చరించే పరిస్థితి.
Tags:    

Similar News