తెలంగాణలో మహమ్మారి వ్యాప్తి రోజురోజుకి పెరిగి పోతుంది. ముఖ్యం గా గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్ శాఖలో కూడా ఈ మహమ్మారి ప్రభావం తీవ్రం గానే ఉంది. వైరస్ సోకి ఒకేరోజు ముగ్గురు మృతి చెందడంతో ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకిందన్న భయం ఉద్యోగుల్లో నెలకొంది.
జూన్ లో మీటర్ రీడింగ్ మొదలైనప్పటి నుంచి భయం గానే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్ తోపాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 9సర్కిల్స్, డివిజన్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారు వైరస్ బారిన పడుతున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం కార్యాలయాల్లో శానిటైజేషన్, మాస్కుల నిబంధన అమలు చేస్తున్నా.. భౌతిక దూరం సరిగా పాటించడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి విద్యుత్ శాఖ ఉద్యోగులను వెంటాడుతోంది.
బయటకు వెళ్లి క్షేత్ర స్థాయిలో, అలాగే ఆఫీసుల్లో ఉండి విధులు నిర్వహించాలన్నా భయ పడాల్సిన పరిస్థితి నెలకొంది. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అర్థం కావడం లేదని సీనియర్ అధికారులు వాపోతున్నారు. గ్రేటర్ లో వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో వినియోగదారులు కార్యాలయాలకు రాకుండా ఆన్ లైన్ లో, లేదా ఫోన్ ద్వారా అవసరమైన సేవలు పొందాలని అధికారులు చూచిస్తున్నారు.