కరోనాతో జనం భయాందోళనలతో ఉన్నారు. ఈ క్రమంలోనే దగ్గువచ్చినా.. తుమ్ము వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రజల భయాన్ని మరింత క్యాష్ చేసుకోవాలనుకున్నారో ఏమో కానీ.. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ఏకంగా కరోనా కేసులు కుప్పలుగా నమోదవుతున్నాయి. ఏం చేస్తున్నారో.? ఎలా చేస్తున్నారో తెలియదు కానీ.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ లో తాజాగా పాజిటివ్ కేసులు కుప్పలుగా నమోదుకావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
తాజాగా హైదరాబాద్ లో ఇటీవల తెలంగాణ సర్కార్ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతులు ఇచ్చింది.దీంతో అవి చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 3726 శాంపుల్స్ ను టెస్ట్ చేయగా.. అందులో 2672 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఆ ఒక్క ల్యాబ్ లోనే పాజిటివిటీ ఏకంగా 71.7శాతంగా నమోదు కావడం గమనార్హం.
దీంతో ఆ ల్యాబ్ లో సరిగ్గా చేస్తున్నారా? పైసల కోసం కార్పొరేట్ ఆస్పత్రులతో మిలాఖత్ అయ్యి ఇలా రిపోర్టులు ఇస్తున్నారో నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వెంటనే పరిశీలించి ఆ ల్యాబ్ ను మూసివేయడంతోపాటు ఆ శాంపుల్స్ ను తిరిగి పరిశీలిస్తోంది.
ఇలా ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులిచ్చిన పాపానికి తెలంగాణలో కుప్పలుగా పాజిటివ్ కేసులు బయటపడడంపై తెలంగాణ సర్కార్ తాజాగా నజర్ పెట్టింది.