చైనాలోని వుహాన్ లో గత ఏడాది చివర్లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళన కు గురి చేస్తోంది. ఈ కరోనా ప్రభావం మనదేశంలో కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. మొదట్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ లో ఉన్నప్పటికీ కూడా ..లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనితో బతికుంటే బడ్డీకొట్టు పెట్టుకుని బతకొచ్చంటూ చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు.
ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ మహానగరం బోసి పోయింది. జూన్ , ,జులై లో హైదరాబాద్ కళకళలాడేది. కానీ , ప్రస్తుతం ఎక్కడ చూసినా టు లెట్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, స్టడీ సెంటర్లు లేక పోవడం తో విద్యార్థులెవరూ ఇప్పుడు హైదరాబాద్ లో లేరు. హాస్టళ్లు, బ్యాచిలర్స్ రూమ్స్, మెస్ లు అన్నీ ఖాళీ అయి పోయాయి. సాధారణం గా మే , జూన్ నెలల్లో ఇతర రాష్ట్రాలకి చెందిన ఎంతోమంది విద్యార్థులు కోచింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చేవారు. దీనితో రూమ్స్ , హాస్టల్స్ కళకళలాడేవి. కానీ, కరో నా భయం తో ఇప్పుడు భాగ్య నగరం విడిచి పోయేవారే తప్ప ... కొత్తగా వచ్చే వారు కనిపించడం లేదు.
ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. దీనితో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలామంది ఇల్లు . హాస్టల్స్ ఖాళీ చేసి సొంత ఊర్లకి వెళ్లిపోయారు. చిరు వ్యాపారులు, లాక్ డౌన్ తో మూతపడిన కంపెనీల్లో పనిచేసే వారంతా.. తిరిగి ఎవరి ఊర్లకి వారు చేరుకుంటున్నారు. దీనితో ఎక్కడికి అక్కడ టు లెట్ బోర్డ్స్ కనిపి స్తున్నాయి. హైదరాబాద్ లో ఒకప్పుడు టు లెట్ బోర్డు ఉంటె వారం లో కచ్చితంగా ఎవరో ఒకరు కొత్త గా వచ్చేవారు. ప్రస్తుతం, ఆ పరిస్థితి లేదు. అలాగే కొంత మంది తాము పనిచేసే కంపెనీల్లో జీతం పూర్తిగా ఇవ్వడం లేదు అని ... వచ్చిన ఆ కొంత జీతం తో హైదరాబాద్ లో నెట్టుకు రావడం కష్టం అని వెళ్లి పోతున్నారు.
మరికొంతమంది భార్యా పిల్లల్ని సొంతూళ్లకు పంపించి.. చిన్న చిన్న రూమ్స్ లోకి అడ్జస్ట్ అయిపోతున్నారు. దీంతో చాలా ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. అప్పు చేసి హైదరాబాద్ లో ఇల్లు కట్టినా.. అద్దెలతో ఈఎంఐ కట్టుకోవచ్చనే భరోసా ఉండేది. కానీ కరోనా దెబ్బతో ఇలాంటివారందరూ పూర్తిగా మోసపోయారు. ఇళ్లు ఖాళీ అయిపోవడంతో.. ఈఎంఐలు కట్టలేక చాలామంది హౌజ్ ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ వేయబోతున్నారు అనే వార్తలు రావడం..అలాగే ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేకపోవడంతో చాలామంది ఇల్లు ఖాళీ చేసి పల్లెబాట పడుతున్నారు.