కరోనా చికిత్సకు ఇప్పుడు సోషల్ మీడియానే ఆయుధం!

Update: 2020-07-11 01:30 GMT
తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య బాగా పెరుగుతోంది. వ్యాప్తి ఎక్కువైపోతోంది. ప్రైవేట్ ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం లేక చాలా మంది రావడం లేదు. అయితే పరిస్థితి విషమిస్తున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది.

ఇటీవలే ఓ సిద్దిపేట జర్నలిస్టు తనకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్ ఇప్పించాలని.. పరిస్థితి దారుణంగా ఉందని.. బతికించండి అని వేడుకున్న వీడియో వైరల్ అయ్యింది. వీటిని నెటిజన్లు.. కొందరు టాలీవుడ్ ప్రముఖులు షేర్ చేస్తూ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. దీంతో అందరికీ ఇప్పుడు ఇదే ఆయుధంగా మారింది.

కరోనాతో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారంతా సోషల్ మీడియాను ఆయుధంగా వాడేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని కృష్ణానగర్ లో కరోనాతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఓ యువకుడు మంత్రి ఈటల రాజేందర్ కు తనకు శ్వాస ఆడడం లేదని.. తనకు వైద్యం అందించాలని ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు.

దీనికి స్పందించిన మంత్రి ఈటల అతడిని గాంధీ ఆస్పత్రికి తరించి చికిత్స అందించినట్టు ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు.  ఇలా హైదరాబాద్ లోనే దాదాపు 80శాతం కేసులు నమోదుకావడం.. ప్రైవేట్ ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో బెడ్స్, చికిత్స కోసం నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News