తెలంగాణ రాష్ట్రంలో పదివేలకు పైగా పాజిటివ్ రోగులు ఇంటి వద్దే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి పాజిటివ్ వచ్చిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించటం.. ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స చేయటం లాంటివి ఇప్పుడు చేయటం లేదు. రోగ లక్షణాలు తీవ్రంగా ఉండే వారిని తప్పించి.. ఎలాంటి లక్షణాలు లేని వారిని.. తక్కువ లక్షణాలు ఉన్న వారిని ఇంటి వద్దనే ఉండి హోంఐసోలేషన్ లోనే చికిత్స పొందాలని సూచనలు ఇస్తున్నారు.
దీనికి తగ్గట్లే.. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు ఇళ్లకే పరిమితమయ్యాయి. అయితే.. ఇంట్లో ఉండే వారు రోజువారీగా ఏమేం చేయాలన్న విషయానికి సంబంధించి ఆరోగ్యకార్యకర్తలు ఫోన్ లో అందుబాటులో ఉంటున్నారు. అయితే.. ఇలా ఉన్న వారేం వాడాలి? ఏమేం వాడకూడదన్న కన్ఫ్యూజన్ తో పాటు.. వారికి తరచూ అవసరమైన మందులు.. ఇతర వస్తువుల్ని కిట్ల రూపంలో బాధితుల ఇంటి వద్దే అందించాలన్న ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం చేసింది.
ఇప్పటివరకూ పాజిటివ్ వచ్చి.. రోగ లక్షణాలు పెద్దగా లేని వారికి ఇవ్వాలని భావిస్తున్నకిట్లో ఏముంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. రోగ లక్షణాలు తక్కువగా ఉన్న వారైనప్పటికీ కనీసం పదిహేడు రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. ఇంటికి పంపే కిట్లో పదిహేడు రోజులకు సరిపడా సామాగ్రిని ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకీ.. ఈ కిట్ లో ఏముంటాయి అన్న విషయంలోకి వెళితే..
- శానిటైజర్లు
- మాస్కులు
- గ్లౌజ్ లు
- హైడ్రాక్సీక్లోరోక్విన్
- పారాసెటమాల్
- యాంటీ బయాటిక్స్
- విటమిన్ సి
- విటమిన్ ఇ
- విటమిన్ డి3 తదితర మందులు
- లివో సెటిరిజైన్
- ఎసిడిటీని తగ్గించే మందులు
- రోగులు ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయాల్ని తెలియజేయటంతో పాటు.. విషయాల మీద అవగాహన మరింత పెంచే పుస్తకం ఒకటి ఇవ్వనున్నారు. ఇవన్నీ ఉచితంగానే అందజేయనున్నారు.