కరోనా వైరస్ మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అలాగే ప్రస్తుతం కరోనా వచ్చింది అని తెలిస్తే , వారిని ఎదో పెద్ద పాపం చేసినవారిలా చూస్తున్నారు. వారికీ దూరంగా ఉండటం మంచిదే కానీ ,వారిపై వివక్ష తగదు అని వైద్యులు , నిపుణులు ఎంతలా చెప్తున్నా కూడా ఎవరూ వినిపించుకోవడం లేదు. కరోనా సోకింది అంటే సొంత కుటుంబ సబ్యులని సైతం అంటరాని వారిలా చూస్తున్నారు. దీనితో కరోనా బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. కరోనా పై పోరాడి విజయం సాధించి ఇంటికి వస్తే ఇంట్లోని వారు వారిని అంటరానివారిలా చుస్తూండటం తో వారు కుమిలిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఉన్న ఫిలింనగర్ లో ఈ తరహా సంఘటన ఒకటి జరిగింది. బీజేఆర్ నగర్ కు చెందిన ఓ 55 ఏళ్ల మహిళకి ఈ మద్యే కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం వెళ్లి , కరోనాతో పోరాడి , కరోనా భారి నుండి బయటపడింది. ఆమె శుక్రవారం సాయంత్రం గాంధీ నుండి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చింది. తల్లి కరోనా భారిన పడి , ఆ వ్యాధి తో పోరాడి తిరిగి ఇంటికి వస్తే తల్లిని ఎంతో ఆప్యాయంగా చేసుకోవాల్సింది పోయి కొడుకు,కోడలు ఆమెను అసలు ఇంట్లోకి రానివ్వలేదు. అలాగే , ఎక్కడ ఆమె ఇంటి పైకి వెళ్తుందేమో అని భావించి ఇంటిపై కప్పు రేకులను కూడా ధ్వంసం చేసి.. ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనితో ఆ మహిళ కొడుకు , కోడలు చేసిన పని ఎవరికీ చెప్పలేక , తనలో తానే భాదపడుతూ రాత్రంతా ఇంటి ముందే కూర్చుంది. కరోనాను జయించి వచ్చిన పేషెంట్ల కు కొన్నిచోట్ల కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ స్వగతం పలుకుతుంటే ... ఇంకొన్ని చోట్ల ఇలా అవమానాలు ఎదురువుతుండటం గమనార్హం. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని , కరోనా పేషెంట్ల పట్ల వివక్ష తగదని వైద్యులు సూచిస్తున్నారు.