లాక్ డౌన్ ఎత్తేసే వేళలో సీఎం కేసీఆర్ వార్నింగ్ విన్నారా?

Update: 2021-06-20 04:53 GMT
అంచనాలకు భిన్నంగా లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్ణయం ఏదైనా సరే.. సీఎం కేసీఆర్ దే ఫైనల్ అన్నట్లుగా వ్యవహరించిన తీరుకు భిన్నంగా  లాక్ డౌన్ ఎత్తివేయటం గమనార్హం. అయితే.. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పే క్రమంలో ఆయనో కీలక హెచ్చరిక చేశారు.

ప్రస్తుతానికి లాక్ డౌన్ ఎత్తివేయటం పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా.. కేసుల నమోదు బాగా తగ్గిన నేపథ్యంలో మాత్రమే లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. లాక్ డౌన్ ఎత్తేసినప్పటికిప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిన పక్షంలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు వెనుకాడమన్న విషయాన్ని స్పష్టం చేశారు.

‘‘మరోసారి లాక్ డౌన్ విధించి.. కఠిన ఆంక్షలు అమలు చేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించామని.. అదే వ్యాధి నియంత్రణకు కారణమైంది’’ అని చెప్పారు. ఇదంతా చూస్తే.. లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్లుగా ప్రకటించిన నిర్ణయం తనదొక్కడిదే కాదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్లు చెప్పాలి. లాక్ డౌన్ ను పూర్తిగా ఏత్తేయటం తొందరపాటు నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని కేసీఆర్ తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసినప్పటికి ఎవరికి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ముంచెత్తే అవకాశం ఉందని భావిస్తున్న మూడో వేవ్ కు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News