చిత్తూరు జిల్లా, పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం లోకి భక్తుల అనుమతిని నిషేధించారు. ఎవరైనా కాణిపాకం రావాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతానికి రావొద్దని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీనికి ప్రధాన కారణం... ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతూన్న నేపథ్యంలో ఏపీలో కూడా రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఆలయ నిర్వాహకులు ఆలయ సిబ్బంది అందరికీ మొన్న కరోనా టెస్టులు చేయించారు. వాటి రిపోర్టులు తాజాగా వచ్చాయి. వాటిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాణిపాకం ఆలయాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ తెరిచారు. భక్తులు అన్ని విధాలా సోషల్ డిస్టాన్స్ పాటించేలా చేశారు. మాస్కులు తప్పనిసరి అన్నారు. అన్ని రూల్సూ పాటించినా వైరస్ వదల్లేదు. అందువల్ల తాత్కాలికంగా భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈవో.