హఫీజ్ పై ఫత్వా జారీ చేసిన బరైలీ దర్గా

Update: 2016-08-19 05:58 GMT
తరచూ ఫత్వాలు జారీ అవుతుంటాయి. కానీ.. బరైలీ దర్గా జారీ చేసిన ఫత్వా ఇప్పుడు వార్తగా మారింది. ఇంతకీ ఆ దర్గా జారీ చేసిన ఫత్వా ఏంటి? ఎందుకా దర్గా తొలిసారి ఆ రకమైన ఫత్వా జారీ చేయాల్సి వచ్చింది? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ తీరులోనే దేశ వ్యాప్తంగా ఉన్న మసీదులు.. దర్గాలన్నీ ఫత్వా జారీ చేయాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. బరైలీ దర్గా జారీ చేసిన ఫత్వా వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని బరైలీలో ఉన్న దర్గా జారీ చేసిన ఫత్వా పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. కరుడుగట్టిన ఉగ్రవాది.. ముంబయి దాడులకు సూత్రధారి.. లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయిద్ పై తాజాగా ఫత్వా జారీ అయ్యింది. హఫీజ్ సయిద్ ఇస్లామ్ వ్యతిరేకి అని.. ఉగ్రవాద సిద్ధాంతాల్ని నూరిపోస్తున్నారంటూ ఈ దర్గా తొలిసారి ఉగ్రవాదిపై ఫత్వా జారీ చేసింది.

భారత్ కు గుణపాఠం చెప్పేందుకు జమ్ముకశ్మీర్ లోకి పాకిస్థాన్ సైన్యాల్ని పంపించాలంటూ హఫిజ్ సయిద్ వ్యాఖ్యలకు తెగబడిన నేపథ్యంలో బరైలీ దర్గా తొలిసారి ఫత్వా జారీ చేసింది. ఈ దర్గా తొలిసారి ఒక ఉగ్రవాదికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. హఫిజ్ ఇస్లామ్ వ్యతిరేకి అని.. ఉగ్రవాద సిద్ధాంతాల్ని నూరిపోస్తున్న నేపథ్యంలో అతడికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. బరైలీ దర్గాను బాటలో దేశ వ్యాప్తంగా ముస్లిం పెద్దలు నడవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ మీద దాడి చేసేందుకు.. దేశ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి విషయంలో ఏ ఒక్కరూ తగ్గరన్న విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. మతం పేరుతో ఆటలాడే హఫీజ్ లాంటి ఉచ్చులో భారతీయ ముస్లింలు పడరన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది.
Tags:    

Similar News