టీటీడీ జంబో పాలకవర్గం సిద్ధమైంది. ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80మందితో జాబితాను ఎంపిక చేశారు. 25మందితో కూడిన నూతన జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘ కసరత్తు అనంతరం పాలక మండలి సభ్యులను ఎంపిక చేశారు.
నిజానికి పాలకమండలిలో చోటు కోసం 100కు పైగా సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది. వడపోతల అనంతరం సభ్యుల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిబెంగాల్ కు చెందిన వారికి చోటు కల్పించారు.
పాలక మండలిలో 24 మందికి చోటు కల్పించిన ప్రభుత్వం.. నలుగురు అధికారులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రకటించింది. దీంతో టీటీడీ బోర్డులో 28మందికి చోటుచ్చింది. మరోవైపు 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. గతంలో ఎన్నడూలేని విధంగా 80మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమైంది.
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.