పార్టీ మారిన ప్రతిసారీ అవే పాత మాటలా శ్రవణ్?

Update: 2022-08-08 05:04 GMT
మంచి వాగ్దాటి.. అంతకు మించి విషయాల మీద అవగాహన.. ఎంతటి కరుడుగట్టిన వాడినైనా సరే.. తన మాటలతో ప్రభావితం చేయటం.. తక్కువలో తక్కువగా చెప్పాలంటే.. ఆయన మాటలు అంతో ఇంతో ప్రభావితం చేస్తాయనటంలో ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించదు. అతనికున్న వాగ్దాటి అతనికి ప్లస్ అయితే..పార్టీలు మారే విషయంలో ఆయన వేసే అడుగులు.. కుప్పి గంతులకు తీసిపోని రీతిలో ఉంటాయని చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ.. ఆ పార్టీ నుంచి బీజేపీలోకి చేరుతున్న వైనం తెలిసిందే.

ప్రజారాజ్యంతో మొదలైన ఆయన ప్రస్థానం తర్వాత టీఆర్ఎస్.. ఆపై కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీలోకి ఆయన ఎంట్రీ ఇస్తున్నారు.

ఆయన పట్టుబట్టి మరీ టికెట్ తెచ్చుకున్న ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని పార్టీలోకి తీసుకున్న వైనంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దాసోజు శ్రవణ్.. ఇప్పుడు పార్టీనే మారిపోయారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలంటే.. శ్రవణ్ విషయంలో నెగిటివ్ ఏమంటే.. పార్టీ మారిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఎప్పుడూ ఒకేలా ఉండటాన్నిపలువురు ప్రస్తావిస్తున్నారు.

బీజేపీలో చేరిక సందర్బంగా.. తాను ఇంటికి వచ్చినట్లుగా.. దాసోజు శ్రవణ్ నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే.. ఇంచుమించుగా.. పార్టీ మారే ప్రతి సందర్భంలోనూ దాసోజు శ్రవణ్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలే వస్తాయని చెబుతున్నారు.

పార్టీ మారిన నేపథ్యంలో పాత మాటల్ని కట్టి పెట్టి.. కొత్త మాటలు కాస్త అయినా చెప్పాలంటున్నారు. సొంత ఇంటికి వచ్చినట్లుగా  చెబుతున్న దాసోజు.. పార్టీ మారిన సందర్భంలో అయినా కాస్తంత లైన్ మారిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. తాను బీజేపీలో రావటంపై మాట్లాడిన దాసోజు శ్రవణ్.. ఎప్పటి మాదిరే తెలంగాణ అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ (సంఘ్) లో .. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే.. తాను సొంతింటికి వచ్చినట్లుగా మాటలు చెప్పిన వైనాన్ని దాసోజు సమర్థించుకునేలా మాట్లాడారని చెబుతున్నారు.
Tags:    

Similar News