ఆటలో విజేత ఎవరన్నది డిసైడ్ చేయలేం. కానీ.. కొన్ని సందర్భాల్లో ఆటలో పైచేయి నాదేనన్న ధీమా ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆ ధీమాకు తగ్గట్లే విజయాన్ని తమ సొంతం చేసుకుంటుంటారు. తాజాగా అలాంటి విజయానందమే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో కనిపించింది. ఆ మాటకు వస్తే.. ఒక్క ఉత్తమ్ లో మాత్రమే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనూ స్పష్టంగా కనిపించింది. వాస్తవ జలదృశ్యం పేరిట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ ముఖం వెలిగిపోవటం స్పష్టంగా కనిపిస్తుంది.
సుదీర్ఘంగా సాగిన పీపీటీని పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తనదైన శైలిలో వివరిస్తూ.. సమర్థమైన వాదనను వినిపించిన వైనం పలువురిని ఆకట్టుకుంది. గూగుల్ మ్యాప్.. విజువల్స్.. పలు పత్రికల్లో వచ్చిన కథనాలు.. తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాయిస్ క్లిప్పింగ్ లను సమయానికి తగ్గట్లుగా ప్రదర్శిస్తూ ఇచ్చిన ప్రజంటేషన్ ఆకట్టుకుంది.
కన్వీన్స్ అయ్యే వాదనతో శ్రవణ్ చెబుతున్న మాటల్నివింటూ తన హావభావాలతో ఉత్తమ్ ఉల్లాసంగా కనిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ను తాము సమర్థంగా తిప్పి కొడుతున్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉండటమేకాదు.. పలు సందర్భాల్లో శ్రవణ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన ముఖం వెలిగిపోవటం స్పష్టం గా కనిపించింది.
శ్రవణ్ ప్రదర్శించిన విజువల్స్ తో పాటు ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటంతో పీపీటీ ప్రదర్శన కాస్త ఆలస్యంగా సాగినప్పటికీ ఎవరికి బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ ను ఎక్కడికక్కడ తప్పు పడుతూ.. పాయింట్ టు పాయింట్ వివరిస్తూ.. కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలని.. ఆయన ప్రదర్శించిన గణాంకాలన్నీ తప్పుల తడకగా చూపించే ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమ ప్రాధాన్యత తెలిసినందునే కాబోలు.. ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దలు సైతం గంటల కొద్దీ పీపీటీని చూస్తుండిపోవటం గమనార్హం. అసలు జలదృశ్యాన్ని ప్రదర్శించే వేళ.. ఉత్తమ్ ముఖంలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.