వివేకా హత్య కేసులో దస్తగిరి స్టేటస్ మారింది

Update: 2021-11-27 04:14 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన సంచలనంగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సొంత సోదరుడు వైఎస్ వివేకా దారుణ హత్య కేసుకు సంబంధించి వెలువడుతున్న అంశాలు షాకింగ్ గామారుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఈ కేసుకు సంబంధించిన అంశాలు సైతం సంచలనంగా మారతాయనటంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకా హత్యలో ఏ4గా ఉన్న షేక్ దస్తగిరికి సంబంధించిన స్టేటస్ లో మార్పు వచ్చింది. ఇప్పటివరకు అతన్ని ముద్దాయిగా పరిణమించిన అధికారులు ఇకపై అతన్ని సాక్షిగా మాత్రమే వ్యవహరిస్తారు.

దీనికి సంబంధించిన కీలక తీర్పును కడప సీనియర్ సివిల్ జడ్జి (సబ్ కోర్టు) ఎస్.కృష్ణన్‌కుట్టి వెల్లడించారు. అంతేకాదు.. అతన్ని ముద్దాయి స్థానం నుంచి సాక్షిగా పరిగణించి.. అతని స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలన్న ఆదేశాన్ని జారీ చేశారు. దీంతో.. దస్తగిరి నుంచి పులివెందుల కోర్టులో అతడి స్టేట్ మెంట్ ను సాక్షిగా పరిగణించి మరోసారి తీసుకుంటారు.

ఇదిలా ఉంటే.. ఈ హత్య కేసులో నిందితుడిగా అరెస్టు చేసిన దేవిరెడ్డి వివశంకర్ రెడ్డిపై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప జైల్లో గెస్టు హౌస్ లో అతడ్ని సుదీర్ఘంగా విచారించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ హత్యలో అరెస్టు అయిన ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరరెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను రద్దు చేస్తూ కోర్టుకు వెల్లడించారు.

ఈ కేసులో ఎర్రగంగిరెడ్డికి జారీ చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరగా.. కోర్టు మాత్రం కొట్టేసింది. మొత్తంగా వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగంగానే కాదు.. ఊహించని పరిణామాలు చోటుకుంటున్నాయి.
Tags:    

Similar News