సామాజిక మాధ్యమాల్లో భద్రత ఉండదని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. పెరిగిన ఈ సాంకేతికత కారణంగానే సమాచారం తస్కరణకు గురై అనేక సైబర్ నేరాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇకపోతే వివిధ దేశాల సమాచారం లీక్ అవుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా పేస్ బుక్ వినియోగదారుల సమాచారం లీక్ అయినట్లు వార్తలు అందరినీ షాక్కు గురి చేశాయి.
పేస్ బుక్ సమాచారం లీక్ అవుతూ యూజర్లను గందరగోళానికి గురి చేస్తోంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయి. 50 కోట్ల మంది పేస్ బుక్ వినియోగదారుల సమాచారం ఓ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తాజాగా ఆంగ్ల మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. యూజర్ల ఎఫ్బీ ఐడీ, పూర్తి పేరు, ప్రాంతాల పేర్లు, పుట్టిన తేదీ వివరాలు, ఈ మెయిల్ ఐడీ, చిరునామా వంటివి లీక్ అయినట్లు ఆ వార్తా సంస్థలు వెల్లడించాయి.
దాదాపు 106 దేశాలకు చెందిన వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ఆ వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నాయి. గతంలో ఇదేమాదిరిగా సమాచారం తస్కరణకు గురైందని వివరించాయి. అయితే ఇది అప్పటిదేనని సైబర్ నిపుణులు అంటున్నారు. అమెరికాకు చెందిన రెండున్నర కోట్ల యూజర్ల సమాచారం ఆన్లైన్లో పొందుపరిచినట్లు గతంలో అనేక పరిశోధనల్లో తేలిందని గుర్తు చేశారు.
పేస్ బుక్ బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోని సమాచారానికి భద్రతలేదని మరోసారి నొక్కి చెబుతున్నారు. ఇప్పుడు లీక్ అయిన సమాచారం... గతంలో బయటకు వచ్చిన డేటా ఒక్కటేనా? లేక ఇది వేరా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎంతోమంది సేఫ్ అనుకొని ఉపయోగించే పేస్ బుక్ డేటా లీక్ కావడం కాస్త ఆందోళన కలిగించే విషయమేనని నెటిజన్లు అంటున్నారు.