ఇలాంటి కంత్రీ కోడ‌లు వ‌ద్దురా బాబూ! య‌మ డేంజ‌ర్‌!!

Update: 2022-11-19 03:03 GMT
ఆ మహిళకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.. వివాహం అయిన నాటి నుంచి అత్తింట్లో బాగానే ఉంటోంది.. ఈ నెల 9వ తేదీన ఆ మహిళ అత్తమామలకు, భర్తకు ప్రేమగా టీ పెట్టి ఇచ్చింది.. అయితే ఆ టీ తాగిన వారందరూ మత్తులోకి వెళ్లిపోయారు.

వారు తిరిగి లేచి చూసే సరికి కోడలు ఇంట్లో కనిపించలేదు.. బీరువాలో ఉండాల్సిన నగలు, డబ్బు కూడా కనిపించలేదు.. నాలుగు రోజులు ఆమె కోసం చివరకు ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని షాకింగ్ విషయం బయటపెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలో ఠాణా కట్ ప్రాంతానికి చెందిన వికాస్ రాథోడ్ అనే వ్యక్తితో గతేడాది మే నెలలో శోభ అనే మహిళకు వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆమె భర్తతో బాగానే ఉంటోంది. అయితే ఆరు నెలల క్రితం శోభకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అహ్సాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు.

వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. చివరకు అహ్సాన్‌తో వెళ్లిపోవాలని శోభ నిర్ణయించుకుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లోని వారందరికీ టీ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. టీ తాగిన వారందరూ అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు.

వారు స్పృహలోకి వచ్చే సరికి ఇంట్లోని 4.5 లక్షల రూపాయల విలువైన నగలు, రూ.50 వేలు పట్టుకుని ప్రియుడితో  వెళ్లిపోయింది. ఆమె కోసం నాలుగు రోజులు వెతికిన భర్త చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వారిద్దరి కోసం గాలించి పట్టుకున్నారు. ఆమె దగ్గర్నుంచి నగలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. శోభను, ఆమె ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విష‌యం వైర‌ల్ కావ‌డంతో ఇలాంటి కంత్రీ కోడ‌లు మాకొద్దురా బాబూ.. అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News