ఏళ్లకు ఏళ్లు ప్రయత్నించినా ఎంతకు పట్టుబడని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడ్ని తాజాగా ముంబయి పోలీసులు అరెస్ట్ చేయటం తెలిసిందే. సంచలనం రేకెత్తించిన ఈ ఉదంతానికి సంబంధించి ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. వివిధ నేరాల్లో నిందితుడైన దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీంను పట్టుకోవటానికి ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితి.
తన సోదరుడు దావూద్ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఇక్బాల్‌కు అలవాటే. ఇదే తీరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వైనంలో.. సదరు వ్యాపారి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా స్కెచ్ సిద్ధం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి నాలుగు ఫ్లాట్లతో పాటు రూ.30 లక్షలు సిద్ధం చేయాల్సిందిగా బెదిరించాడు.
తనను బెదిరిస్తున్న వైనాన్ని సదరు వ్యాపారి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పక్కా ప్యూహాన్ని సిద్ధం చేశారు. రాత్రి వేళ అతని ఇంటి తలుపు తట్టారు పోలీసులు.ఆ సమయంలో బిర్యానీ తింటూ టీవీలో వస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ ను చూస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంత పెద్ద డాన్ ఇంత సింఫుల్ గా దొరికిపోవటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలవురు పారిశ్రామికవేత్తల్ని.. బిల్డర్లు.. రాజకీయ నేతల్ని సైతం ఇక్బాల్ బెదిరించినట్లుగా తెలుస్తోంది.