కరోనా కల్లోలం అమెరికాలో కొనసాగుతోంది. ప్రధానంగా న్యూయార్క్ లో మరణ మృదంగం వినిపిస్తోంది. న్యూయార్క్ లో కరోనాతో చనిపోయిన శవాలను ఖననం చేయడానికి ఏకంగా ఓ దీవిని ఏర్పాటు చేశారు. ఇక ఆస్పత్రుల మార్చురీలు, గదులు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ శవాలను సీజ్ చేసి పడేస్తున్నారు.
తాజాగా కరోనా వైరస్ మృతదేహాలను ట్రక్కుల్లోకి కూడా ఎక్కించి తరలిస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కరోనా మృతదేహాలతో వెళుతున్న ట్రక్కులు రోడ్లపై కనిపించడం చూసి అందరూ షాక్ అయ్యారు. న్యూయార్క్ లో కరోనా మరణాల తీవ్రతను ఇది సూచిస్తోంది.
మృతదేహాలను నిల్వ చేయడానికి ఆస్పత్రులు, ఇతర గదులు నిండడం.. స్థలం లేకపోవడంతో మృతదేహాలను ఒకదానిపై ఒకటి పేర్చి ట్రక్కుల్లోకి ఎక్కించి పంపించిన వైనాన్ని తాజాగా ‘న్యూయార్క్ పోస్ట్ ’ పత్రిక బయటపెట్టింది. ఆసుపత్రుల నుంచి ట్రక్కుల్లోకి కరోనా శవాలను మార్చి అనాథ శవాలుగా వాటిని ఖననం చేయడానికి పంపించిన దైన్యం కనిపించింది.
ఈ శవాలను కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆ శవాలను ఎక్కడ ఖననం చేస్తారు.? వారి బంధువులకు కూడా తెలియకుండా ట్రక్కుల్లో కుక్కి పంపిస్తున్నారు. దీంతో కనీసం కరోనా తగ్గాక కూడా తమ వారి గురించి వారి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కుటుంబ సభ్యులకు కలగడం లేదు. కరోనా శవాలను ఎక్కడ పూడుస్తున్నారో.. సమాధులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇలా న్యూయార్క్ లో కరోనా శవాల దుస్తితిపై తాజాగా బయటపడ్డ నిజాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.