రెండేళ్లుగా కరోనా మహమ్మారి కంటికి కనిపించకుండా ప్రజల ప్రాణాలు తీసుకుపోతోంది. ముఖ్యంగా గత ఏడాది కరోనా రెండో దశలో లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. తమ ఆత్మీయులను కోల్పోయిన చాలా మందికి లాక్డౌన్ వల్ల కనీసం చివరి చూపు కూడా దక్కలేదు. ఇక కొవిడ్ సోకి మరణించిన వారు అంతిమ సంస్కారాలుకు కూడా నోచుకోలేదు. అందరూ ఉన్న అనాథల్లా మట్టిలో కలిసి పోయారు. అయితే కరోనా సోకి మరణించిన తన భర్త అస్థికలను లాకెట్లో పెట్టుకుని అందులోనే తన జీవిత భాగస్వామిని చూసుకుంటూ బతికేస్తున్నారు.
కోల్కతాకు చెందిన పాప్రీ చౌదరి, అరూప్ ప్రకాశ్ చౌదరి దంపతులు గతేడాది కరోనా సోకి ఒకే ఆస్పత్రిలో చేరారు. ఇద్దరూ ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందారు. అయిత పాప్రీకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండి తనపై వైరస్ ప్రభావం ఎక్కువగా చూపలేదు. కానీ అరూప్ రోగనిరోధక శక్తి ఎక్కువగా లేకపోవడం వల్ల మహమ్మారి సోకిన తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది. ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతుండగా.. పాప్రీ తన భర్తను ఒకసారి చూడాలనుకున్నారు.
పీపీఈ కిట్ ధరించి తన భర్త వద్దకు వెళ్లిన పాప్రీ.. మీకేం కాదు.. మీరు బతుకుతారు అంటూ ధైర్యం చెప్పింది. కానీ అరూప్కి తన పరిస్థితేంటో అర్థమైంది. "నేనిక ఊపిరి తీసుకోలేను" అంటూ ఆయాసపడుతూ భార్య చేతిని పట్టుకున్నారు. పాప్రీ భర్తను నిర్లిప్తంగా చూస్తూ. "ఆయన పోరాడుతున్నారు. ఆయన బ్రతుకుతారు" అని ఒక నర్సు ఆమెతో చెప్పారు. కానీ, ఆయన బతకలేదు. నాలుగు రోజుల తర్వాత అరూప్ మరణించారు. కరోనా నుంచి కోలుకుని పాప్రీ మాత్రమే ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్లారు.
తన భర్త మరణం తర్వాత పాప్రీ డిప్రెషన్లోకి వెళ్లారు. తన మనసుని మళ్లించుకోవడానికి ఆధ్యాత్మికతవైపు అడుగేశారు. తన భర్త అస్థికలను చైన్ లాకెట్లో పెట్టుకుని ధరిస్తున్నారు. లాకెట్లో తన భర్త అస్థికలు పెట్టుకోవడంతో తన భర్త తనని విడిచి ఎక్కడికి వెళ్లలేదన్న భావన కలుగుతోందని పాప్రీ అన్నారు. భర్తను కోల్పోయి ఎంతో మానసిక వేదనను అనుభవించిన పాప్రీ.. తనలాగే కరోనా వల్ల ఆత్మీయులను కోల్పోయిన వారికి సాయం చేయాలనుకున్నారు. అందుకోసం మానసిక నిపుణురాలు అవ్వాలనుకున్నారు. సైకాలజీ క్లాస్లో చేరి థెరపిస్ట్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన కరోనా.. దాని వల్ల తను పడిన మానసిక వేదన.. తన కుటుంబం అనుభవించిన నరకం గురించి ఆమె ఒక పుస్తకం రాస్తున్నారు.
కరోనా వల్ల ఎంతో మంది తన ఆత్మీయులను కోల్పోయారు. చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. కొందరి జీవితాలు ఎటూ సాగకుండా అగమ్యగోచరంగా తయారయ్యాయి. తీరని దుఃఖాన్ని నింపిన కరోనాను మరిచిపోకుండా.. అది తెచ్చిన కల్లోలం నుంచి ధైర్యంగా బయటపడి బతుకున్నామని చూపేందుకు నిదర్శనంగా కరోనా మృతుల కోసం ఒక స్మారకం ఏర్పాటు చేయాలని పాప్రీ అభిప్రాయపడ్డారు. కొందరు సమాజ సేవకులతో కలిసి కోల్కతాలో కరోనా మృతుల స్మారకం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్న ఏకైక కరోనా స్మారకం ఇదే.
కరోనా మహమ్మారి వల్ల భర్తలను కోల్పోయిన భార్యలు, జీవితాధారం కోల్పోయిన మహిళలు అత్తారింట్లో అనేక వేధింపులకు గురవుతున్నారని పాప్రీ ఆవేదన చెందారు. వారి కోసం ప్రభుత్వాలు ఏదైనా చేయాలని కోరారు. మరోవైపు కరోనా మహమ్మారి వల్ల భర్తను కోల్పోయిన డాక్టర్ రజని జగ్‌తప్ తనలాంటి వారిలో ఆత్మస్తైర్యం నింపేందుకు స్టేయింగ్ అలైవ్ అనే ఓ ఆన్లైన్ సపోర్ట్ గ్రూపు ప్రారంభించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం 60 మంది సభ్యులున్నారు. అందులో ఒక థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఒక న్యాయవాది ఒక యోగా గురువు కూడా ఉన్నారు. కరోనా వల్ల ఆత్మీయులను కోల్పోయిన వీళ్లంతా ఒకరికొకరు అండగా.. ఆలంబనగా తోడుంటున్నారు.