వీలీనం సీక్రెట్ చెబుతానంటున్న దీప‌

Update: 2017-04-20 07:17 GMT
సినిమాటిక్ త‌ర‌హా స‌న్నివేశాల‌తో త‌మిళ‌నాడు రాజ‌కీయ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న‌టివ‌ర‌కూ అప్ర‌తిహ‌తంగా సాగిన మేన‌ల్లుడి హ‌వా ఇప్పుడు మొత్తంగా పోవ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు పార్టీ నుంచే బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి. ఇక‌.. త‌న తిరుగులేని వ్యూహంతో ప్ర‌త్య‌ర్థుల్ని తొక్కేసే అమ్మ నెచ్చెలి చిన్న‌మ్మకు ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితి. నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ ప‌ళ‌ని ప్ర‌భుత్వాన్ని సింగిల్ హ్యాండ్‌ తో న‌డిపిన ఆమె.. ఇప్పుడు పార్టీకి. ప్ర‌భుత్వానికి ప‌నికిరాకుండా పోయారు.

పైకి క‌నిపిస్తున్న ప‌రిణామాల‌న్నీ ఉత్త నాట‌కాలుగా కొట్టిపారేస్తున్నారు అమ్మ మేన‌కోడ‌లు.. ఆమె వార‌సురాలిగా ముద్ర వేయించుకోవాల‌ని తెగ త‌హ‌త‌హ‌లాడే దీప. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. త‌మిళ‌నాడులో రెండు వ‌ర్గాల విలీనం పేరిట జ‌రుగుతుంద‌న్న‌దంతా క‌ప‌ట నాట‌కంగా ఆమె అభిర్ణిస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ అవినీతిలో బాగా ఆరితేరిన వారిగా విమ‌ర్శించిన ఆమె.. గ‌తంలో వీరిద్ద‌రూ చేసిన అక్ర‌మాల‌న్నీ తాజా ర‌చ్చ‌తో బ‌య‌ట‌ప‌డిపోతాయ‌న్న ఉద్దేశంతో మ‌ళ్లీ క‌లిసిపోయార‌ని ఆరోపిస్తున్నారు. వీరిద్ద‌రి విలీనం వెనుకున్న ర‌హ్యం అదేన‌ని చెబుతున్నారు.

ముందుగా త‌యారు చేసుకున్న స్ర్కిప్ట్ ప్ర‌కార‌మే ప‌న్నీర్ సెల్వం క‌ప‌ట నాట‌కానికి తెర తీసినట్లుగా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. వీరి వింత నాట‌కాన్ని ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని.. స‌రైన స‌మ‌యంలో వీరిద్ద‌రికి గుణ‌పాఠం చెబుతార‌ని చెబుతున్నారు. అన్నాడీఎంకే విలీనంపై ప్ర‌జ‌ల్లో ఎలాంటి ఆస‌క్తి లేద‌ని తేల్చేశారు. ఒక‌వేళ దీప చెప్పిందే నిజ‌మ‌ని అనుకుంటే.. ఇప్పుడొచ్చిన తెలివి చిన్న‌మ్మ‌కు మొదట ఎందుకు రాలేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. అన్నింటికి మించి ఎంత నాట‌క‌మైనా.. త‌న పాత్ర‌ను అంద‌రి చేత ఛీ కొ్ట్టించుకునేలా స్క్రిప్ట్ రాయించుకుంటారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. లాజిక్ గా చూస్తే.. దీప మాట‌ల్లో అంత నిజం లేద‌న్న భావం క‌ల‌గ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News