చావు దెబ్బతిన్న పార్టీని దెప్పి పొడుస్తున్న సొంతవారు

Update: 2020-02-13 04:30 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కొనగా చచ్చిన పామును ఇంకా చావగొట్టినట్టు సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. తిన్నింటి వాసాలే లెక్క పెట్టేలా నాయకుల ప్రవర్తన ఉండడంతో మింగుడు పడడం లేదు. ఓటమి భారంతో కుంగిపోయిన కాంగ్రెస్ పై సొంత పార్టీ నాయకులే విరుచుకుపడుతున్నారు.

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 63 చోట్ల డిపాజిట్లు గల్లంతు కావడం.. ఒక సీటు కూడా గెలవకపోవడంతో పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తుకుని ఆ పార్టీకి నాలుగు సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ సొంతంగా 66 స్థానాల్లో పోటీ చేయగా వాటిలో 3 మినహాయించి 63 చోట్ల డిపాజిట్ రాకపోవడంతో ఆ పార్టీ దారుణంగా ఉందనేందుకు ఇదే ఉదాహరణ. విమర్శలు, వినూత్న చర్యలతో హాట్ టాపిక్ గా నిలిచే ఆల్కా లాంబా కూడా డిపాజిట్ కోల్పోవడం విశేషం. ఒక్కటంటే ఒక్కస్థానాన్ని కూడా గెలవక పోవడంతో ఒక్క సారిగా పార్టీ నాయకత్వం పై సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికైనా మేల్కొందాం.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఆశించనప్పటికీ.. ఇంత దారుణంగా ఓడిపోతామని మాత్రం కలలో కూడా అనేకోలేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నటి ఖుష్బూ వాపోయారు. అసలు పార్టీ పనిచేస్తుందా? లేదా? సరైన దారిలో వెళుతున్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని, పరిస్థితుల్ని చక్కబెట్టుకుందామంటూ ఖుష్బూ సూచించారు.

అయితే పార్టీ నాయకత్వంపై ఓ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్వ నాశనం.. ఢిల్లీలో కాంగ్రెస్ ఘోరపరాజయంలో తన వంతు పాత్ర కూడా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ ఓటమి ని అంగీకరించారు. ఢిల్లీ లో కాంగ్రెస్ సర్వ నాశనమై పోయిందని, కార్యకర్తల్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం కొరవడిందని, వ్యూహం, సమన్వయం అసలే లేకుండా పోయాయని ఓటమికి గల కారణాలు వివరించారు. పై స్థాయిలో ఆలస్యం గా నిర్ణయాలు తీసుకోవడం.. పార్టీ ఓటమికి గల కారణాల్లో ప్రధానమైందని, ఇక ఆత్మశోధన చేసుకునే సమయం ఆసన్నమైందని శర్మిష్ట పేర్కొన్నారు.
Tags:    

Similar News