ఢిల్లీకి చెందిన మధ్య వయస్కురాలైన ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. లేడీస్ వేసుకునే షార్ట్ డ్రెస్సుల మీద దారుణ వ్యాఖ్యలు చేసిన మహిళ ఎవరన్న వివరాలు బయటకు రాలేదు కానీ.. ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం భారీ దుమారాన్ని రేపుతున్నాయి.
ఢిల్లీలో తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్ లో స్నాక్స్ తింటున్న వేళ.. ఒక మహిళ తమ వద్దకు వచ్చిందని.. పొట్టిగా ఉన్న దుస్తులు వేసుకున్నందుకు సిగ్గుపడు అని వ్యాఖ్యానించినట్లుగా ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో.. తాము బదులిస్తూ.. పొట్టి దుస్తులు వేసుకోవటం తప్పు కాదని వాదనకు దిగామని.. తన స్నేహితులు కూడా ఆమెతో వాదన చేశారన్నారు. తమ మాటలతో మరింత రెచ్చిపోయిన మహిళ.. అక్కడున్న వారందరితో బిగ్గరగా.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి దుస్తులు ధరించారు.. నగ్నంగా కనిపించేందుకు.. రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్ షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నారని దారుణ వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు.
దాంతో షాక్ తిన్న తాము.. ఆమెను వెంటాడామని.. ఆమె వికృత మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియో తీసినట్లుగా సదరు యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సదరు మధ్యవయస్కురాలు చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాలని ఎంత కోరినా.. ఆమె మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం.
అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడే హక్కు లేదని.. ఎలాంటి దుస్తులు వేసుకున్నా ప్రశ్నించటానికి నువ్వు ఎవరంటూ ఒక మహిళ ఆమెతో వాదనకు దిగగా.. పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధురాళ్ల గురించి నీచమైన వ్యాఖ్యలు చేయటం.. ఇలాంటి వారిని పురుషులు రేప్ చేయాలని పేర్కొనటం దారుణమని మహిళ మండిపడ్డారు. అప్పటికి వెనక్కి తగ్గని ఢిల్లీ ఆంటీ.. రేప్ చేయించుకునేందుకే ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నారంటూ వీడియో చివర్లో వ్యాఖ్యానించటం గమనార్హం. పది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.