ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల .. పోలింగ్ ఏ రోజంటే ?

Update: 2020-01-06 11:49 GMT
ఢిల్లీ లో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోడా ప్రకటించారు. దీనికి సంబంధించి జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు. దీనితో ఢిల్లీ లో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సునీల్ అరోడా తెలిపారు.

ఢిల్లీలో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 22తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగియనుంది. ఢిల్లీలో 13,767 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సునీల్ అరోడా తెలిపారు. ఎన్నికల కోసం 90వేల మంది పోలిస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సునీల్ అరోరా హెచ్చరించారు.

2015లో ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక పార్టీ ఆప్ 67 స్థానాలు దక్కించు కోగా.. బీజేపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని కేజ్రీవాల్ పార్టీ భావిస్తుండగా... బీజేపీ కాంగ్రెస్‌లు కూడా ఓటర్ల ను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే:
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: జనవరి 14
నామినేషన్ల దాఖలు ప్రారంభం: జనవరి 14
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: జనవరి 21
నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 24
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 8ఎన్నికల ఫలితాలు: ఫిబ్రవరి 11


Tags:    

Similar News