ట్విట్టర్ సారీ చెప్పాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశం?

Update: 2020-02-13 07:30 GMT
ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినట్లుగా క్షమాపణలు చెప్పటం కానీ.. లేదంటే తాము పేర్కొన్న మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లించాలని పేర్కొంది. ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు ఈ తరహా ఆదేశాలు ఎందుకు జారీ చేసిందన్న విషయంలోకి వెళితే..

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతంలో.. బాధితురాలి అసలు పేరును వెల్లడించినందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాధితురాలి అసలు పేరును వెల్లడించటాన్ని తప్పు పట్టింది. ఈ వ్యవహారంలో క్షమాపణలు చెప్పాలని.. ఇలాంటివి మరోసారి జరగవని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది.

ఒకవేళ.. తాము ఆదేశించినట్లుగా ట్విట్టర్ కానీ సారీ చెప్పని పక్షంలో.. రూ.10లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాము పేర్కొన్న రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలుగా నాలుగు వారాల గడువును ఇచ్చింది. హైదరాబాద్ శివారులో దిశపై హత్యాచారానికి పాల్పడిన ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారి.. దేశ వ్యాప్తంగా చర్చను రేపింది.

ఈ ఇష్యూలో బాధితురాలి అసలు పేరును వెల్లడించిన సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలంటూ యష్ దీప్ చహల్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పటేల్ తాజాగా ఈ తరహా ఆదేశాల్ని జారీ చేశారు. మరి.. దీనిపై ట్విట్టర్ స్పందన ఏమిటో చూడాలి.


Tags:    

Similar News