ఒక కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే అంశం.. పెళ్లైన వారి విషయంలో ఒకలా.. పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ లో ఉంటే మరోలా ఉండే అంశంతో పాటు.. ఆ ఇష్యూ మౌలిక అంశాల పైనా చర్చను రేకెత్తించేలా కోర్టు సీన్ చోటు చేసుకుంది. ఇంతకీ ఆ కేసేమిటి? అంటే.. పెళ్లైన మహిళ.. భర్త సెక్సు చేసేందుకు బలవంతం చేస్తే.. నో చెప్పేయొచ్చా? నో చెప్పే హక్కు ఆమెకు ఉందా? మగాడికి ప్రత్యేక సౌకర్యం ఏమిటి? లాంటి ఎన్నో ప్రశ్నలు తెర మీదకు వచ్చేలా చేసింది.
వైవాహిక అత్యాచారాన్ని (భార్య భర్తను సెక్సు వద్దని చెప్పినప్పటికీ శృంగారం చేసిన పక్షంలో) నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్ధేర్.. జస్టిస్ సి.హరిశంకర్ ల ధర్మాసనం పలుకీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైతే.. భర్త బలవంతంగా శృంగారం చేస్తానంటే.. దానికి సెక్షన్ 375 కింద అత్యాచార కేసు వర్తించదా? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఇది సరికాదన్న వ్యాఖ్యను చేసింది.
పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది. ఐపీసీ సెక్షన్ 375 పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని అధికరణం 14 (దీని ప్రకారం భారత భూభాగంలో ఉన్న వ్యక్తులంతా సమానంగా.. భారత చట్టాల ప్రకారం కాపాడబడాలి. ప్రభుత్వం వ్యక్తుల పట్ల కుల.. మత.. వర్గ.. వర్ణ.. లింగ.. పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఎలాలంటి వివక్ష చూపించకూడదు) ను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. అధికరణం 21లను కూడా ఉల్లంఘించేలా ఉన్నాయా? అన్నది పరిశీలించాల్సిన అవసరం ధర్మాసనానికి ఉందని పేర్కొంది.
ఇక.. అధికరణం 21 విషయానికి వస్తే.. జీవించే హక్కును చట్టం ద్వారా నిర్దేశించిన పద్దతిప్రకారం తప్ప మరే విధంగానూ హరించటానికి వీల్లేదని పేర్కొంటుంది. యాభై దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం.. ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నందిత రావ్ మాత్రం భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపుల్నిరద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారని.. ఈ మినహాయింపులు భార్యల గౌరవానికి భంగం కలిగినట్లుగా నిరూపించగలరా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జస్టిస్ శక్ధేర్ కలుగజేసుకొని.. ఒక మహిళ నెలసరితో ఉన్నప్పుడు.. భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించారనుకోండి.. అయినప్పటికీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే అది నేం కాదా? అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది నందిత సమాధానమిస్తే.. అది నేరమేనని.. కానీ అత్యాచార చట్టం పరిధిలోకి రాదన్నారు.
దీంతో కలుగజేసుకున్నన్యాయమూర్తి రియాక్టు అవుతూ.. ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. సహజీవనం చేసే వారి విషయంలో ఈ చర్య ఐపీసీ సెక్షన్ 375 పరిధిలోకి వస్తుంది. వివాహిత విషయంలో మాత్రం ఎందుకు రాదు?సంబంధాన్ని బట్టి ఇలా వేరు చేయటం ఏమిటి? అని ప్రశ్నించారు. మొత్తంగా ఒక కీలక చర్చకు ఢిల్లీ హైకోర్టు తెర తీసిందని చెప్పాలి.