ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాకు ఘోర అవమానం జరిగింది. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే పోలీసులు అతన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాధికారి ఎంఎం ఖాన్ హత్యకు గురైన కేసులో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే దినేశ్ మీడియాకు తెలిపారు. ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడకు పోలీసులు చేరుకున్నారు. మైక్ ముందు దినేశ్ మాట్లాడుతుండగానే పోలీసులు అతన్ని పట్టుకెళ్లారు. ఓ మహిళను వేధించిన కేసులో దినేశ్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఆప్ నేతలు స్పందిస్తూ పోలీసుల తీరు సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అభియోగాలు ఉంటే అరెస్టు చేసేందుకు ఉన్న విధివిధానాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు సభలో సభ్యులనే విషయాన్ని మరిచి వ్యవహరించడం పట్ల తాము ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.