ఢిల్లీలో ఇంకో ఎయిర్‌ పోర్ట్‌...పెద్ద రిలీఫ్‌!

Update: 2017-06-24 10:20 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీకి విమానంలో ప్ర‌యాణించ‌డం ఎంత సౌక‌ర్య‌వంత‌మో అక్క‌డున్న ట్రాఫిక్ కార‌ణంగా ఎయిర్‌ పోర్ట్ నుంచి రాజ‌ధానిలోని నిర్దేశిత ప్రాంతానికి చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కుల కార‌ణంగా అంతే ఇబ్బందిక‌రం. ఢిల్లీ స‌మీపంలో వేగంగా విస్త‌రిస్తున్న ప్రాంతాల్లో విమానాశ్ర‌యం ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ఎప్ప‌టినుంచో ఉంది. అయితే దానికి తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఢిల్లీ చేరువ‌లో కొత్త‌ విమానాశ్ర‌యాన్ని నిర్మించ‌నున్నారు. గ్రేట‌ర్ నోయిడాలోని జెవార్‌ ప్రాంతంలో గ్రీన్‌ ఫీల్డ్ విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తారు. ఈ విమానాశ్రయ‌ నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తి లభించింది.

విమాన ప్ర‌యాణికులు పెరుగుతున్న నేప‌థ్యంలో కొత్త ఎయిర్‌ పోర్ట్‌ లు అవ‌స‌ర‌మ‌ని విమానయాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు తెలిపారు. నోయిడా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం రానున్న 15 ఏళ్ల‌లో సుమారు 50 మిలియ‌న్ల ప్ర‌యాణికుల‌కు సేవ‌లు అందిస్తుంద‌ని అశోక‌గ‌జ‌ప‌తి రాజు వివ‌రించారు. ఎయిర్‌ పోర్ట్ కోసం మూడు వేల హెక్టార్ల‌ను కేటాయించారు. వెయ్యి హెక్టార్ల‌కు మొద‌టి ద‌శ‌లో ప‌నులు పూర్తి చేశారు. సుమారు 20 వేల కోట్ల పెట్టుబ‌డులు అవ‌స‌రం ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. జెవార్ ప్రాంతంలో ఎయిర్‌ పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డాన్ని యూపీ మంత్రి ఎస్ ఎన్ సింగ్ స్వాగ‌తించారు. జాతీయ - అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌ను చేర‌వేడ‌మే కాకుండా కొత్త విమానాశ్ర‌యం కార్గో హ‌బ్‌ గా కూడా ప‌నిచేస్తుంద‌ని మంత్రి అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News