ఢిల్లీ అల్లర్ల వెనక పెద్ద కుట్ర? మోదీని ఇరికిండానికేనంట..

Update: 2020-02-26 15:30 GMT
అమెరికాలో పర్యటించిన సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల కిందటే భారత పర్యటన షెడ్యూల్ ను అమెరికా ప్రకటించింది. ఈ  ఫిబ్రవరి 24-25 తేదీల్లో అమెరికా నుంచి వచ్చాడు. మొదట గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ర్యాలీ అనంతరం మొతెరా స్టేడియం ప్రారంభోత్సవంలో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీకి పయనమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ఢిల్లీలో అడుగు పెట్టగానే ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. మొదట అంతగా ఊహించలేదు.. కానీ మంగళవారం తెల్లవారుజాము వరకు తీవ్ర రూపం దాల్చాయి. ఏకంగా 7మంది చనిపోవడంతో పరిస్థితి చేయి దాటింది. అయితే మంగళవారం కూడా పరిస్థితి అదుపు తప్పి అల్లర్లు రాజుకున్నాయి. అయితే ఈ రెండు రోజులు ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయం లోనే జరిగాయి.

అంటే ఉద్దేశపూర్వకంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలుస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే ఢిల్లీలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ పర్యటన సందర్భం గా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినా సోమవారం రాత్రి నుంచి అల్లర్లు మొదలయ్యాయి. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు వచ్చిన సందర్భంలో అతడికి ఘన స్వాగతం పలకాల్సింది పోయి తమ ఆందోళనలతో అంతర్జాతీయంగా పరువు తీసేలా పలువురు ఈ దాడులకు పాల్పడ్డట్టు సమాచారం.

ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రతో ఈ అల్లర్లు చెలరేగాయని పరిస్థితులను పరిశీలిస్తుంటే తెలుస్తున్నాయి. అమెరికాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దురాభిప్రాయం కలిగేలా చేయాలనే ఉద్దేశం దాగి ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో ముస్లింలను పక్కన పెట్టేసేలా పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చారని, భారత్ లో పరిస్థితులు బాగా లేవని అమెరికా కు చాటి చెప్పేందుకు ఈ అల్లర్లు సృష్టించినట్లు సమాచారం.

అందుకే ఎప్పుడు లేనంతగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజాము వరకు ఏకంగా 20 మంది చనిపోవడం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డొనల్డ్ ట్రంప్ దృష్టిలో నరేంద్ర మోదీపై చెడ్డ పేరు రావాలనే దురాభిప్రాయంతో కొందరు కుట్ర పన్ని ఈ అల్లర్లకు తెర లేపారని తెలుస్తోంది. వారి పథకం ప్రకారమే అల్లర్లు చెలరేగి పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వారి అనుకున్నట్టే ఢిల్లీలో పరిస్థితులు ట్రంప్ సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చర్చకు వచ్చాయి. ఢిల్లీ అల్లర్లు వాటిపై ప్రస్తావనకు రాలేదని, అవన్నీ భారత అంతర్గత వ్యవహారమని కొట్టిపారేశారు. అయితే ఇవి అమెరికా అధికార యంత్రానికి చిరాకు తెప్పించాయని సమాచారం. తమ అధ్యక్షుడు దేశ పర్యటనకు వస్తే శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో విఫలమయ్యారనే భావన తెప్పించేందుకు ఈ దాడులు కొందరు ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

మరి అదే వాస్తవమైతే సర్వత్రా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఒక దేశ అధ్యక్షుడు పర్యటించిన సమయంలో వారికి ఆత్మీయ స్వాగతం పలికి భారతదేశ మౌలిక సూత్రం అతిథి దేవోభవను పట్టించుకోకుండా ఇలా చేయడం తగదని ప్రజలు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News