డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ల డెలివరీ

Update: 2021-06-02 13:31 GMT
కోవిడ్ కల్లోల సమయంలో టెక్నాలజీని ఎంత ఉపయోగించుకుంటే అంత మేలు. అంత త్వరగా ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు. ఇప్పటికే ఇది నిరూపితమైంది కూడా. కరోనా కల్లోలం వేళ హైదరాబాద్ వంటి మహానగరంలో ట్రాఫిక్ ఇబ్బందులతో మందుల పంపిణీ కానకష్టం అవుతోంది.అలాగే వ్యాక్సిన్లను పంపిణీ చేయడం లేట్ అవుతోంది. అత్యవసర మందులు అందక చాలా మంది చనిపోతున్నారు.

అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో రోగులకు అత్యవసర ఔషధాలు అందించే సేవలు మరింతగా అందుబాటులోకి రాబోతున్నాయి. మెడిసిన్స్ ఫ్రం స్కై పేరుతో డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు డెలివరీ చేసేందుకు డూన్జో సంస్థ అనుమతులు సాధించింది. అతి త్వరలోనే ఈ సేవలు హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి.

ఆకాశం ద్వారా డ్రోన్లతో ఎటువంటి జాప్యం లేకుండా క్షణాల్లో ఇవి హైదరాబాద్ అంతటా గాల్లో ప్రయాణించి రోగులకు చేరవేయగలవు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే కోవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు, ఇతర అత్యవసర మందులు డ్రోన్ల ద్వారా ఇంటికే తెప్పించుకునే సామర్థ్యం దీని ద్వారా సొంతమవుతుంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్ ఫ్రం స్కై పేరుతో పైలెట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను డూన్జో సంస్థ అందివ్వనుంది. ఈ డ్రోన్ల ద్వారా అత్యవసర ఔషధాలు, కోవిడ్ మెడిసిన్లు, వ్యాక్సిన్లను సైతం ఎంపిక చేసిన చిరునామాకు డోర్ డెలివరీ చేయనున్నారు.

గూగుల్ తోపాటు వైద్యరంగానికి సంబంధించిన నిపుణులతో ఏర్పాటైన మెడ్ ఎయిర్ కన్సార్టియం మెడిసిన్ డ్రోన్ డెలివరీ సిస్టంపై ప్రయోగాలు చేసి బీవీఎల్ఓఎస్ నే పద్ధతిలో ఈ డ్రోన్ డెలివరీ సిస్టంను రూపొందించాయి. దీనికి కేంద్రం అనముతించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక అనుమతి రావాల్సి ఉంది.

పైలెట్ ప్రాజెక్ట్ గా దీన్ని డూన్జో సంస్థ, మెడ్ ఎయిర్ కన్సార్టియంలు కలిసి హైదరాబాద్ తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూనే, గురు గ్రాం, జైపూర్ మొత్తం 8 నగరాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
Tags:    

Similar News