చైనాలో పాత‌ ఫోన్ల‌కు డిమాండ్‌.. ఎందుకంటే..?

Update: 2021-09-14 07:57 GMT
సరఫరాల్లో సమస్యల నెల‌కొన్నందున కొత్త స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ తగ్గింది. దీంతో పాటు కరోనా రోగం విజృంభించ‌డం వ‌ల్ల విచక్షణారహిత వాడేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు. ఫలితంగా రీఫర్బిష్డ్ సెల్ ఫోన్లకు ఎక్కువ గిరాకీ ఏర్పడింది. 2019తో పోలిస్తే రీఫర్బిష్డ్ సెల్ ఫోన్ల విక్రయాలు 2020లో రెట్టింపునకు పైగా పెరిగాయని ఇండ‌స్ర్టీ వర్గాలు తెలిపాయి. యంత్రా అన్నది ఫోన్ రిపేర్, రీఫర్బిష్డ్‌ సేవల్లోని ఒక కంపెనీ. ఈ సంస్థ సీఈవో జయంత్‌జా మాట్లాడారు. రూ.4,000 నుంచి 6,000 ధరల శ్రేణిలోని రీఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్లు కేవలం 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్టు చెప్పారు. దీంతో ఆ ఫోన్ల నిల్వ‌లు త‌గ్గి పోయాయ‌న్నారు.

ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే మార్చిన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గడిచిన సంవ‌త్స‌ర‌ కాలంలో ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పారు. హ్యాండ్‌సెట్‌లపై ఆధారపడడం ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు. వచ్చే 12 నుంచి 18 నెలల్లో భార‌త దేశవ్యాప్తంగా 750 పట్టణాలకు మా కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ఆయ‌న తెలిపారు. 450 పట్టణాల్లో ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లను ఆన్‌లైన్‌ వేదికగా యంత్ర ప్లాట్‌ఫామ్‌ వినియోగించిన కొనుగోలు చేస్తుంటుంది. నిపుణులతో వాటిని తనిఖీ చేయించి మ‌ళ్లీ మంచి స్థితిలోకి తీసుకొచ్చి రీఫర్బిష్డ్ విక్రయాలు జ‌రుపుతుంటోంది.

నూత‌న ఫోన్ల వ‌లే రీఫర్బిష్డ్‌ ఫోన్లపైనా అర్ధ సంవ‌త్స‌రం వరకు వారంటీ ఇస్తున్నారు. కోవిడ్ రాకతో ఆన్‌లైన్‌ వినియోగం పెరగడం మ‌నంద‌రికీ తెలిసిందే. ఎన్నో సేవలను ఫోన్లలోని యాప్‌ల స‌హాయంతో పొందుతున్నారు. విద్యార్థులు సైతం ఆన్‌లైన్ చ‌దువుల‌కు మళ్లడం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఫోన్లకు డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. గ‌త సంవ‌త్స‌రం కరోనా వచ్చిన తర్వాత దేశంలో లాక్‌డౌన్‌లు ప్రకటించడం మ‌నంద‌రికీ తెలిసిందే.

దీనికి తోడు ప్ర‌స్తుత కాలంలో కరోనాతో చైనాలోని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు కార్యకలాపాలను నిలిపివేయడం లేదా త‌క్కువ వాడ‌కంలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు చైనా నుంచి మన దేశానికి వచ్చే విడిపార్ట్స్‌కు తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి తగ్గిపోవ‌డం, ఇదే సమయంలో డిమాండ్‌ పెరగడం వంటి పరిస్థితులు ఓల్డ్ ఫోన్లకు గిరాకీని తీసుకొచ్చిన‌ట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. దీంతో వినియోగదారులు ఇప్పుడు 30వేల రూపాయ‌ల ల్యాప్‌టాప్‌లు, రూ.10,000 నుంచి 15,000 ధరల శ్రేణిలోని స్మార్ట్‌ఫోన్ల కొనేందుకు మొగ్గు చూపడం లేదని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది.

2019లో 2–3 కోట్ల రీఫర్బిష్డ్‌ మొబైల్‌ ఫోన్లు అమ్ముడుపోగా.. 2021లో 4.8 కోట్ల రీఫర్బిష్డ్‌ ఫోన్ల అమ్మకాలు నమోదు కావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా ఇండియాలో మ‌ళ్లీ సెకెండ్ హ్యాండ్ ఫోన్ల‌కు గిరాకీ పెరిగింది. క‌రోనాతో అంద‌రీ ఆర్థిక ప‌రిస్థితి కుదేల‌య్యింది. దీంతో కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబెట్లు కొనేందుకు ఎవ‌రు సాహ‌సం చేయ‌డం లేదు. ఇటువంటి ప‌రిస్తితుల్లో సెకెండ్ హ్యాండ్‌వే రీ సైకిల్ చేసి మళ్లీ అమ్మ‌డం వ‌ల్ల అటు కంపెనీకి, ఇటు వినియోగ‌దారుల‌కు లాభం చేకూర‌నుంది. ఇరువైపులా లాభం ఉండ‌డంతో ఈ బిజినెస్ ఇప్పుడు ఊపందుకోనుంది.


Tags:    

Similar News